సర్దార్ గౌతులచ్చన్న  జీవితం ఆదర్శనీయం - ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్

*సర్దార్ గౌతులచ్చన్న  జీవితం ఆదర్శనీయం .. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్


బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న 14 వ వర్ధంతిని రాజేంద్రప్రసాద్  కార్యాలయం బిసి నాయకులు వీరంకి గురుమూర్తి  మరియు రాజులపాటి ఫణి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేశారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా  రాజేంద్రప్రసాద్ పాల్గొని లచ్చన్న   చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించారు.


ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ లచ్చన్న రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడి వారికి అండగా నిలిచిన నాయకుడు లచ్చన్న ని అందుకే ఆయన ప్రజనాయకుడిగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారని రాజేంద్రప్రసాద్ తెలిపారు.


ఆయన లీడర్ విజన్ నేటి యు వతకు ఆదర్శం అని రాజేంద్రప్రసాద్అ న్నారు.


ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈడే అంజి బాబూ, బూరెల నరేష్ వల్లూరి కిరణ్  తదితరులు పాల్గొన్నారు