గుంటూరు: అర్బన్ పరిధిలో కోవిడ్ - 19 కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున, రేపటి రోజు అనగా *ది.11-04-20 వ తేదీన ఆదివారం నాడు పూర్తిగా లాక్ డౌన్ అమలులో ఉంటుందని, పాలు, ఇతర నిత్యావసరాలతో సహా కొనుగోలు / అమ్మకాలు ఏమీ జరగకుండా పూర్తిగా నిషేధం విధించడం జరిగిందని,* గుంటూరు అర్బన్ పరిధిలోని ప్రజలందరూ సహకరించాలని గుంటూరు అర్బన్ పోలీస్ అధికారి డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ తెలియ జేశారు.
*చికెన్, మటన్ వంటి మాంసాహార అమ్మకాలు కూడా రేపటి నుండి తిరిగి ఉత్తర్వులు ఇచ్చేవరకు అమ్మకాలు / కొనుగోళ్ళు చేయరాదని* తెలియజేశారు.
కంటోన్మెంట్ (రెడ్ జోన్స్) ఏరియాలు గుంటూరు అర్బన్ నందు 12 ప్రదేశాల్లో కొనసాగుతున్నాయని, *ఆయా కంటైన్మెంట్ ఏరియాల లోని ప్రజలు బయట నుంచి లోపలకు, లోపల నుండి బయటకు ఎవరు వెళ్లరాదని,* ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని, *వారికి కావలసిన నిత్యావసర సరుకులు, మందులు, వైద్య సంబంధమైనటు వంటి వాటిని, సంబంధిత ఏరియాల ప్రవేశాల వద్ద, సంబంధిత శాఖలకు సంబంధించిన వాళ్లతో కంట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వాళ్లను ఫోన్ల ద్వారా ( ఏరియావైజ్ ఫోన్ నెంబర్ల లిస్టు అటాచ్ చేయడమైనది ) సంప్రదించి సేవలు పొందాలని తెలియ జేశారు.*
రేపటి ఆదివారం తర్వాత అనగా *సోమవారం నుండి కూడా ప్రజలు కూరగాయలు, పాలు వంటి నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కేవలం ఉదయం 06:00 నుండి 09:00 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుందని, ఆ తరువాత మెడికల్ షాపులు, అత్యవసర మైన ఆసుపత్రులు తప్ప ఎలాంటి షాపులు, వగైరాలు తీసి ఉండరాదని,* ఉల్లంఘించిన వారిపై చట్టబద్ధంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగు తుందని తెలియ జేశారు.
రోడ్లపైన, కాలనీల నందు *ఆహారపు ప్యాకెట్లు, వగైరాలను వ్యక్తులు, సంస్థలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అనుమతి లేకుండా ఎవరు పంపిణీ చేయరాదని,* ఆహారము మొదలైనవి చేయాలనుకునే వారు *జిల్లా కలెక్టర్ గారి వద్ద సంప్రదించి, నమోదు చేయించుకుని, అనుమతి పొంది మాత్రమే (అనుమతించిన మేరకు) ఆహారం, వగైరాలను పంపిణీ చేయాలని,* ఉల్లంఘించిన వారిపై చట్టబద్ధమైన కేసులు నమోదు చేయడం జరుగు తుందని హెచ్చరించారు.