పెదకాకాని నిరు పేదలకు అన్నదానం
గుంటూరు,ఏప్రిల్ 19,(అంతిమ తీర్పు): జిల్లా పెదకాకాని గ్రామంలో రైల్వేస్టేషన్ వద్ద గల రెండు వందల మంది నిరుపేద నిర్భాగ్యులకు గొళ్ళ జ్యోతి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమన్ని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ శ్రేణులు, దయార్థ హృదయం గల అనేక మంది దాతలు పెద్దఎత్తున విరాళాలు అందిస్తూ పేదల, నిరాశ్రయుల, బిచ్చగాళ్ళ ఆకలిని తీరుస్తూoటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ఆపద సమయంలో చురుకైన పాత్ర పోషించకపోవడం దారుణమన్నారు. కులం, మతం, రాజకీయాలు, వర్గాలకు అతీతంగా కరోనా వైరస్ అరికట్టడంలో ఐక్యంగా కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ విశ్రాంత జాయింట్ కమిషనర్ గొళ్ళ జోసెఫ్, మాజీ సర్పంచ్ పొందుగల మెస్సినియా దేవి, వైకాపా నాయకులు మాతంగి నిర్మల, బంగారు మరియమ్మ, అమరె ప్రసాద్, గొళ్ళ శ్యామ్ ముఖర్జీ బాబు తదితరులు పాల్గొన్నారు.