తాడేపల్లి ,ఏప్రిల్ 09.:
కరోనా నియంత్రణ విషయంలో అందరూ ప్రభుత్వసూచనలను పాటించాలిః ప్రభుత్వ ప్రజావ్యవహాారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
కరోనా (కోవిడ్ -19)నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు నాగార్జున యూనివర్శిటి సమీపంలోని రెయిన్ ట్రీ పార్క్ విల్లా ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన సూక్ష్మక్రిములు,బాక్టీరియాలను నివారించే సేఫ్ టన్నెల్ ను ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పరిశుభ్రతే ధ్యేయంగా రెయిన్ ట్రీ పార్క్ లో విల్లాలఎంట్రన్స్ వద్ద సేఫ్ టన్నెల్ ను ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు.
కోవిడ్ -19కు ప్రస్తుతం వ్యాక్సిన్ గాని,మందు గాని లేదని పరిశుభ్రతే దానికి సరైన ఆయుధం అన్నారు.పరిశుభ్రతతో ఉంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉంటే ఆ వైరస్ దరిచేరదని అన్నారు.రాష్ర్ట ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ నుంచి రాష్ర్టాన్ని ,ప్రజలను రక్షించడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నారని అన్నారు.ముఖ్యంగా వైద్యఆరోగ్య శాఖ,పోలీసు,పారిశుధ్య,రెవిన్యూ తదితర శాఖలు నిత్యం అప్రమత్తంగా ఉండేలా తగు ఆదేశాలు ఇస్తున్నారని తెలియచేశారు.లాక్ డౌన్ వల్ల కొన్ని
తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికి ప్రజలు కూడా సహకరిస్తున్నారని అన్నారు.కరోనానుంచి రక్షించుకోవడానికి ప్రస్తుతం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అధికారయంత్రాంగం తక్షణం స్పందించేలా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవస్దలను బలోపేతం చేశారని వివరించారు.
పొన్నూరు ఎంఎల్ఏ వెంకటరోశయ్య మాట్లాడుతూ కరోనా నియంత్రణ ప్రజలచేతిలోనే ఉందని అన్నారు.ప్రభుత్వం చేస్తున్న సూచనలు తూచతప్పకుండా పాటిస్తూ అత్యవసరమై ,తప్పనిసరైతే తప్పితే ఇంటినుంచి బయటకు రాకూడదని తెలియచేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూధనరెడ్డి మాట్లాడుతూ కరోనానుంచి రక్షించుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ,లోకల్ కమ్యూనిటి అసోసియేషన్ అధ్యక్షులు నరసరాజు,పుల్లాప్రసాద్త్,సమాచారహక్కు కమీషనర్ బివి రమణకుమార్, పార్టీ రాష్ర్ట కార్యదర్శి శ్రీ సిద్దారెడ్డి,ఎస్సిసెల్ రాష్ర్ట ప్రధానకార్యదర్శి శ్రీ గోచిపాత శ్రీనివాస్ , సిమ్స్ విద్యాసంస్ధల డైరక్టర్ భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.