మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ పంపిణి

.

మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ పంపిణి
     
            గుంటూరు    :గుంటూరు లోని శ్యామల నగర్,  పట్టాభిపురం లోని 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు, పెద పలకలురి లోని   బుడబుక్కల బిసి కాలనీ లో ని 150 మంది నిరుపేదలకు టిఫిన్ పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర  చైర్మన్ వల్లo రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ గుంటూరు నగరంలో కరోనా  ప్రభావం రోజు రోజుకి పెరుగుతుందని ప్రజలందరూ జాగ్రత్త వహించి సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. రోడ్లమీద ఉమ్మివేయడం చేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్  ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్, శ్యామల నగర్ పెద్దలు నాదెళ్ల వెంకటరమణమూర్తి, గుంటూరు మల్లేశ్వరి, అయినాల వెంకట కృష్ణారావు, పి.మల్లారెడ్డి, పి.రత్నారెడ్డి, పరుచూరి బలరామయ్య, సిసింధర్  రెడ్డి తదితరులు పాల్గొన్నారు.