రేషన్ సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సరఫరా చేయాలంటున్న ఆయా గ్రామీణ,పట్టణ ప్రాంత ప్రజలు,
కర్నూల్,ఏప్రిల్,1(అంతిమతీర్పు-బ్యూరో):-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాప కింద నీరులా ప్రవేశిస్తున్న కరోనా వైరస్ రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో మొన్నటి దాకా 17 కేసులు కే పరిమితమైన ఒక్కసారిగా రాష్ట్రంలో కరోనా వైరస్ గా గుర్తించబడిన 82 కేసులు పాజిటివ్ కేసులుగా తేలడంతో ఆంధ్ర రాష్ట్ర ప్రాంతప్రజలుఒక్కసారిగాభయాందోళనకుగురవుతున్నారు.మొన్నటి దాకా చాలా తక్కువగా ఉన్న కరోనా వైరస్ మన రాష్ట్రంలో ఒక్కసారిగా భారీ సంఖ్యలో వైరస్ సోకడంతో ప్రభుత్వం రేషన్ షాపుల దగ్గర క్యూలో ఒకరి వెనుకాల ఒకరు నిలబడడంతోనే,ఒక్కసారిగా జనాలు రేషన్ షాపులా దగ్గరకు గుంపులు గుంపులుగా రావడం తోనే జనాలు ఉక్కిరి బిక్కిరి అవడంతో నే ఈ కరోనా వైరస్వ్యాప్తిచెందిందిఅనివిశ్లేషకులుభావిస్తున్నారు.ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్,ఉచిత కందిపప్పుకు ఒక్కసారిగా రేషన్ షాపులా దగ్గరకు జనాలు రావడంతోనే ఒకరికొకరు టచ్ లో ఉండటం వల్లే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని అని విశ్లేషకులు,ఆయా గ్రామీణ ప్రాంతప్రజలుచర్చించుకుంటున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో అత్యధికంగా 82 కరోనా కేసులు పాజిటివ్ గా రావడంతో ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించి గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతంలో గాని ఆయా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ సరుకులనువాలంటీర్ల ద్వారా ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయా గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.