బొప్పాయి తోటను పరిశీలించిన తహసిల్ధారు

బొప్పాయి తోటను పరిశీలించిన తహసిల్ధారు


వింజమూరు, ఏప్రిల్ 11 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న బొప్పాయి తోటను శనివారం నాడు తహసిల్ధారు యం.వి.కే. సుధాకర్ రావు పరిశీలించారు. స్థానిక జీ.బి.కే.ఆర్ ఎస్టీ కాలనీ సమీపంలో యర్రబల్లిపాళెం కు చెందిన గణపం.వెంకటరమణారెడ్డి 8 ఎకరాలలో బొప్పాయి పంటను సాగు చేశారు. అయితే గత రోజుల క్రితం సాయంత్రం సమయంలో వీచిన ఈదురు గాలులు, అకాల వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న బొప్పాయి పంటలో కొంతభాగం చెట్లు విరిగిపోయి కాయలతో సహా నేలకొరిగి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఈ విషయం తెలుసుకున్న తహసిల్ధారు బొప్పాయి తోటను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అంతేగాక తమలపాకు, మొక్కజొన్న, అరటి తోటలకు కూడా అకాలవర్షం నష్టం కలిగించినట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని కూడా పరిశీలించి పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు అందజేస్తామని తహసిల్ధారు తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్ధారు వెంట వి.ఆర్.ఓ వెంగయ్య, వి.ఆర్.ఏ షరీఫ్, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.