ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కేంద్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల సలహా మండలి సభ్యుని లేఖ

*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి* గారికి నమస్కరించి వ్రాయు బహిరంగ లేఖ...


*కేంద్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సలహా మండలి* అధ్యక్షులు *వి.శ్రీ నివాసులు నాయుడు*..


*విషయం:* కరోనావైరస్ కట్టడి చర్యలు బాగంగా లాక్ డౌన్ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సహాయం భవన నిర్మాణ కార్మికులకు  అందజేయాలని కోరుతూ...


కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశ వ్యాప్తంగా అనుసరిస్తున్న లాక్ డౌన్ ఎంతో శ్రేయస్కరమైనది. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఎంతో కట్టుదిట్టంగా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అమలు చేస్తున్న తీరు ప్రశంసనీయం. 


కాని నిత్యం రెక్కాడితే గాని, డొక్కాడని పేద, మధ్యతరగతి ప్రజలలో చాలా మంది సగటు కూలీలుగా ఎక్కువ శాతం భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగాలలో పని చేస్తూ వున్నారు. అసలే పనులు కరువై ఈ మధ్య నెలలో సగం దినాలు కూడా సరైన పని దొరక్క పస్తులుండే పరిస్థితులనే కార్మికులు ఎదుర్కొంటున్నారు.  మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు, లాక్ డౌన్ మూలంగా మరింత సంక్షోభంలోకి వారి జీవితాలను నెట్టివేసినట్టైంది. ఎలాగైనా వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం వుంది.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు
31000 వేలకోట్ల రూపాయులు కేటాయింపు చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భవన నిర్మాణ కార్మికులుకు ఇంకా సంక్షేమ మండలి భోర్డు నుండి వారికి ఏలాంటి సహాయం అందలేదని రాష్ట్రంలోని గుర్తింపు పోందిన యునియన్లు వారు నా దృష్టికి తీసుకువచ్చారు.


భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నిధిలో వసూలు
సెస్సు డబ్బు ఉండగా, వారి కోసం మాత్రమే కర్చు చేయాల్సిన డబ్బు వారికి ఇవ్వడానికి మీకు ఏ అవరోధాలు ఏర్పడుతున్నాయి?


గతంలో వివిధ కార్పొరేషన్ నిధులు నవరత్నాలు అమలుకు  తరలించినట్లు భవన నిర్మాణం కార్మికుల సంక్షేమ నిధి డబ్బు అంతా వాడేశారా?


స్వయానా కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు భవన నిర్మాణ కార్మికుల నిధి లోని డబ్బును ఆ కార్మికుల సంక్షేమానికి వాడమని చెబితే ఎందుకు నిర్లిప్తత తో వ్యవహరిస్తున్నారు?
 
రిజిష్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు అకౌట్లు కార్మిక శాఖ దగ్గర ఉన్నప్పుడు ఏందుకు వారి ఖాతా ల లోకి ఇంతవరకు నగదు బదిలీ చేయడం లేదు?


పై ప్రశ్నలకు గౌరవ ముఖ్యమంత్రి 
*శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు* సమాధానం చెప్పాలి, వెంటనే భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరగాలి.
వారు ఆకలితో అలమటించకుండా వుండేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రతి కార్మికుడిని ఈ పరిస్థితి నుండి గట్టెక్కించాలి. వారిని ఆదుకునే క్రమంలో కార్మికుల సంక్షేమ మండలి బోర్డు లో నమోదు చేసుకున్న 20 లక్షల మంది కార్మికులుకు  జీవన భృతిని నేరుగా వారి ఖాతాలలో జమచేయాలి. 
అలాగే కార్మికుల సంక్షేమ మండలి బోర్డులో అనివార్య కారణలతో పేర్లు నమోదు కాని ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు,రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు మొత్తం సుమారు 30 లక్షల మంది ఉన్నారు. వారిని వాలెంటీర్ల ద్వారా గుర్తించి, అలాంటి వారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం వుంది. అందుకోసం కార్మిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి  కార్మిక లోకాన్ని ఆదుకోవాలని కోరుతున్నాను.
ఇట్లు
*వి.శ్రీ నివాసుల నాయుడు*
అధ్యక్షులు
*కేంద్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల సలహా మండలి*