జర్నలిస్టులను ఆదుకోవాల్సీన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంది : అనపర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగా సుబ్బారెడ్డి

జర్నలిస్టులను ఆదుకోవాల్సీన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంది
అనపర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగా సుబ్బారెడ్డి
బిక్కవోలులో పాత్రికేయులకు శానిటైజర్లు, నిత్యవసర వస్తువులు పంపిణీ
బిక్కవోలు: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై అలుపెరుగని పోరాటం చేస్తున్న పాత్రికేయులను ఆదుకోవాల్సీన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు షేక్. ఉస్మాన్ బాషా అధ్యక్షతన పెదపూడి, బిక్కవోలు మండలాల పాత్రికేయులకు శానిటైజర్లు, నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎర్రబాట దినపత్రిక ఎడిటర్ పితాని రాము సమకూర్చిన శానిటైజర్లు, మాస్కులు, కూరగాయల కిట్లు, అనపర్తి  పౌల్ట్రీ ఫెడరేషన్ మరియు నెక్ కర్రి వెంకట ముకుందా రెడ్డి ఏర్పాటు చేసిన కోడిగుడ్లు ట్రేలను పాత్రికేయులకు అనపర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి, ఎంపిడిఓ ఎం.అనుపమ సతీష్, ఎస్ఐ పి.వాసు, ఏపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్. సలీమ్ చేతుల మీదుగా పంపిణీ చేసారు. ఈ సందర్భంగా అనపర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పాత్రికేయుల భాగస్వామ్యం కీలకమైందన్నారు. పాత్రికేయులకు ప్రభుత్వం నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు. గత వారంలో పెదపూడిలో ఎస్పీ చేతుల మీదుగా బిక్కవోలు, రంగంపేట, పెదపూడి మండలాల్లో 50 మంది పాత్రికేయులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన పెదపూడి, బిక్కవోలు ప్రెస్ క్లబ్ లను జంగా సుబ్బారెడ్డి అభినందించారు. అనంతరం ఏపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్. సలీమ్ మాట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్దితుల్లో పాత్రికేయులు ప్రాణాలను తెగించి వార్తలు సేకరిస్తున్నారన్నారు. అటువంటి పాత్రికేయులకు లాక్ డౌన్ నేపధ్యంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పాత్రికేయులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎర్రబాట ఎడిటర్ పితాని రాము మాట్లాడుతూ జర్నలిస్ట్ గా తనకు సాటి జర్నలిస్టుల సమస్యలు తెలుసుకాబట్టి ఉడత భక్తిగా తన వంతు సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు ప్రెస్ క్లబ్ కార్యదర్శి హేమసురేష్,  పాత్రికేయులు రమేష్, ప్రసాద్, రఘు, రవి, శ్రీను, బాబురావు, కర్రి రామకృష్ణారెడ్డి, కొండపల్లి ధర్మరాజు చౌదరి, ఆరుమిల్లి శ్రీను, కర్రి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.