మూడు నెలలుగా జీతాలు లేవు.

మిత్రులారా, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నిరంతరం శ్రమిస్తున్న వారిలో ప్రభుత్వ ఆస్పత్రుల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. వారికి మూడు నెలలుగా జీతాలు లేవు. వీరి కాంట్రాక్టింగ్ ఏజెన్సీల గడువు ముగిసింది. కొత్త ఏజెన్సీల నియామకం జరగలేదు. తాత్కాలిక ప్రాతిపదిక పై పాత ఏజెన్సీ లతోనే నడిపిస్తున్నారు. తమ ఏజెన్సీల భవితవ్యం ఏమిటో తెలియక వాళ్ళు పైసా కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదు. దాంతో జీతాలు ఇవ్వ లేదు.సంబంధిత శాఖ నిధులు ఇంకా  విడుదల చేయ లేదు. అత్యవసర సర్వీసు  పేరుతో వాళ్ళతో నానా చాకిరీ చేయిస్తున్నారు. యూనియన్  అడిగే వరకూ మాస్క్ లు, గ్లవ్స్ ఇవ్వలేదు. శానిటైజర్స్  ఇవ్వలేదు. పని గంటలు పెరిగాయి. పని పెరిగింది.  అయినా జీతాలు ఇవ్వక పోతే  సిబ్బంది ఎలా బతకాలి?  పైగా తాజాగా  వైద్య, ఆరోగ్య సేవలను ఎస్మా పరిధి లోకి తెచ్చారు. ఆందోళనలు, సమ్మెలు చేయకూడదు. ఈ సారి సేవలు నిరాకరిస్తే  సిబ్బందిని  అరెస్ట్ చేసే ప్రావిజన్  కూడా చేర్చారు. ప్రస్తుతం  కార్మికుల స్థితి ఇది. వాళ్ల సమస్య పరిష్కారం కావాలని కోరుకుందాం.  మోరల్  సపోర్ట్  ఇద్దాం. థాంక్స్.