ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జస్టీస్
వి. కనగ రాజ్ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ వి. కనగ రాజ్ ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో శనివారం విజయవాడలో ని ఆర్ అండ్ బి భవన్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన బాధ్యత లు స్వీకరించడ మైనది.
తమిళ నాడు రాష్ట్రము మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వి.కనగరాజ్ దాదాపు తొమ్మిదేళ్లపాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం జస్టిస్ వి.కనగరాజ్ నియామకం జరిగింది.
రాష్ట్ర గవర్నర్ శ్రీ బిస్వాభూషన్ హరిచందన్ ను శనివారం ఉదయం రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నూతనంగా భాద్యతలు స్వీకరించిన జస్టీస్ వి. కనగ రాజ్