విజయసాయిరెడ్డీ.. మీరెలా తిరుగుతారు? : చంద్రబాబు
అమరావతి : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయసాయిరెడ్డి రాష్ట్రమంతా తిరుగుతున్నారని.. లాక్‌డౌన్ సమయంలో ఆయన ఎలా తిరుగుతారని ప్రశ్నించారు. హాట్‌స్పాట్లలో వైసీపీ నేతలు పర్యటించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఓ ఎమ్మెల్యే పూలవర్షం కురిపించుకున్నారని పరోక్షంగా రోజాపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందన్నారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలపై శ్రద్ధ పెట్టిన రాష్ట్రాల్లోనే కరోనా కంట్రోల్ అవుతోందని.. ఇప్పటికైనా మొండివైఖరి వదిలి ప్రజల కోసం పనిచేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. మరీ ముఖ్యంగా హాట్‌స్పాట్లలో కఠినచర్యలు తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు.
విజయసాయిరెడ్డీ.. మీరెలా తిరుగుతారు? : చంద్రబాబు