అమరావతి: స్పందనపై ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ సమీక్ష


వినతుల పరిష్కారంలో నాణ్యత అనేది చాలా ముఖ్యం: సీఎం
మీరు ఏదైనా వినతిని తిరస్కరించేముందు దానిపై సరైన కసరత్తు అవసరం:
తిరస్కరిస్తున్న వినతులు కలెక్టర్‌ పరిశీలనకు రావాలి:
కలెక్టర్‌ పరిశీలించిన తర్వాత దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలి:
దీనికి సంబంధించి ఒక యంత్రాంగాన్ని కలెక్టర్‌ ఏర్పాటు చేసుకోవాలి:
ఇష్టమొచ్చిన కారణాలు చూపి వినతులను తిరస్కరించకూడదు:
అలాగే పెండింగులో పెట్టిన వినతులపైన కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలి:
పెండింగ్‌ వినతులు తగ్గాలంటే కలెక్టర్లు కచ్చితంగా జోక్యం చేసుకోవాలి:
పెండింగు వినతులు ఎక్కువగా ఉన్న నెల్లూరు, కర్నూలు కలెక్టర్లతో మాట్లాడిన సీఎం
వినతుల సంఖ్య రెట్టింపు అయ్యిందన్న కర్నూలు కలెక్టర్‌
అందుకు తగిన రీతిలో అధికారులను, యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నామన్న కర్నూలు కలెక్టర్‌
పెండింగులో ఉన్న దరఖాస్తులను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌
స్పందన కింద వచ్చే వినతులకు రశీదులు ఇవ్వడంలో ఇబ్బందులు వస్తున్నాయంటూ తన దృష్టికి వచ్చిందన్న సీఎం
క్యూలు కూడా భారీగా పెరుగుతున్నాయని, చాలాసేపు ప్రజలు వేచి చూడాల్సి వస్తున్నట్టుగా తన దృష్టికి వచ్చిందన్న సీఎం
అప్పటికప్పుడే చేతి రాతతో రశీదు ఇచ్చి తర్వాత వాటిని కంప్యూటర్లలో అప్‌లోడ్‌ చేయించాలని సీఎం ఆదేశం 
ప్రజల్ని ఎక్కువ సేపు క్యూలో ఉంచొద్దన్న సీఎం