శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

                                            తిరుపతి, 2019 ఆగస్టు 27


శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం


తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు.


ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు. 


ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ, ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.


ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ తిరుమలయ్య,  టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ మునిత్నం, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


సెప్టెంబరులో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు


శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.


-  సెప్టెంబరు 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. 


- సెప్టెంబరు 14న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.00 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.


- సెప్టెంబరు 24న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11.00 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గ హస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.


- సెప్టెంబరు 28న అమావాస్యనాడు ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి గ హస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. సాయంత్రం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల నడుమ హనుమంత వాహనసేవ జరుగనుంది. 


---------------------------------------------


Popular posts
కేసులు ఉపసంహరించుకోవాలి:తంగిరాల సౌమ్య
ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్ 
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఉప రాష్ట్రపతి కి నిమ్మరాజు చలపతిరావు సన్మానం
మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ : మోడీ