టి.డి.పి.నేతలతో చంద్రబాబు భేటీ


గుంటూరు పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు భేటి అయ్యారు.
చర్చనీయాంశాలు: 
1). చిదంబరంపై తీర్పులో కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల ప్రస్తావన. ఆర్ధిక నేరాలకు రిఫరెన్స్ గా జగన్ కేసులు. ఇంత ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది. చిదంబరంపై తీర్పులో 20,22పేజీలలో జగన్ ప్రస్తావన ఉంది. 
''ఆర్ధిక నేరాలు మిగిలిన వాటికంటే భిన్నమైనవి. వాటిని మిగిలిన కేసులతో పోల్చలేం. కాబట్టి బెయిల్ ఇచ్చేముందు విభిన్నంగా ఆలోచించాలి. భారీ కుట్ర ద్వారా పెద్దఎత్తున ప్రజాధనానికి నష్టం చేసే కేసులను సీరియస్ గా పరిగణించాలి. ఆర్ధిక నేరాలు దేశ ఆర్ధిక వ్యవస్థకే చేటు. దేశ ఆర్ధికాన్ని దెబ్బతీసే చర్యలను తేలిగ్గా తీసుకోరాదు'' అని చిదంబరం తీర్పులో జగన్ కేసులను ప్రస్తావించి చెప్పారు.
'' వైఎస్ జగన్మోహన్ రెడ్డికి  సంబంధించిన కేసులో అనేకమంది కుట్రదారుల లావాదేవీలపై బహుళ రీతుల్లో జరిపిన దర్యాప్తును పరిశీలించిన మీదట సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారీ పరిమాణంలో ప్రజాధనం కైంకర్యమైన నేరపూరిత కుట్రలో బెయిల్ పిటిషన్లపై కఠినంగా వ్యవహరించాలి. భారీ స్థాయిలో నేరాలకు పాల్పడేవారు ఎంతో నేర్పుగా ముందస్తు ప్రణాళిక వేసుకుని అమలు చేస్తారు. మోసపూరిత ఆర్ధిక లావాదేవీలు దేశ ఆర్ధికానికే చేటు'' అంటూ చిదంబరం కేసుపై తీర్పులో జగన్ ప్రస్తావన చేశారని'' చంద్రబాబు గుర్తు చేశారు.
న్యాయ శాస్త్రం సిలబస్ లో కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతిని పాఠ్యాంశం చేశారు.
హార్వర్డ్ యూనివర్సిటిలో జగన్ అవినీతి ఒక చర్చనీయాంశం కావడం తెలిసిందే. క్విడ్ ప్రొ క్వో అవినీతి విధానం సృష్టికర్త. 
అలాంటి వ్యక్తి ఇప్పుడు నీతిపాఠాలు వల్లెవేస్తున్నారు. విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇంత ఘనత ఉన్న జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడతారు. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే..
2. రాష్ట్రాభివృద్దికి గండికొట్టడమే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపేశారు. రాజధాని అమరావతిలో పనులు ఆపేశారు. పోలవరం పనులు ఆగిపోయాయి. గత 3నెలల్లో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఒక్క ఇటుక పెట్టలేదు. 
పైగా ఇటుకల తయారీ దార్లు, బేల్ దారీ కార్మికులు, సెంట్రింగ్, కార్పెంటరి, చేతివృత్తుల వారి పొట్టకొట్టారు. అసంఘటిత కార్మికుల ఉపాధిని దెబ్బతీశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు.
3.వ్యవస్థలన్నీ కొలాప్స్ అయ్యాయి. రాష్ట్ర రాబడి పూర్తిగా పడిపోయింది. రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ గవర్నమెంట్ తెచ్చారు. ఉన్న వ్యవస్థను సమర్ధంగా వినియోగించుకోవడంలో విఫలం చెందారు. సమన్వయం లేదు, కన్వర్జెన్స్ లేదు.
4. రద్దులు,తీసివేతలు,తొలగింపుల ప్రభుత్వంగా వైసిపి ప్రభుత్వం మారింది. రేషన్ ఎగ్గొట్టడం, కార్డులు తొలగించేందుకే ఇ కెవైసి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
5. వేధింపులు, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు-దౌర్జన్యాలు ఆగడం లేదు. బాధితులంతా ప్రతిరోజూ వచ్చి వాపోతున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులకు భద్రత కల్పించాలి. బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తాం. వైసిపి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాడుతాం. 
ఈ భేటిలో మాజీ మంత్రులు పయ్యావుల కేశవ్, బుచ్చయ్య చౌదరి, కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, టిడి జనార్దన్, పంచుమర్తి అనూరాధ తదితరులు పాల్గొన్నారు.