ముఖ్యమంత్రి గారి ప్రతిష్టాత్మక కార్యక్రమం స్పందన - ఎం.ఎల్.ఎ
సత్యవేడు, ఆగష్టు 26: నేటి నుండి ఈనెల 30 వ తేది వరకు వాలింటర్లు మీఇంటి వద్దకు వస్తున్నారు, మీరు వారి వద్ద వినతులు అందించ వచ్చని జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్త అన్నారు. సోమవారం జిల్లాలో స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు.
స్పందన కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ఉదయం10.30 గంటలకు ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లాకలెక్టర్ వినతులు అందించడానికి హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఈ నెల 30 వరకు మీఇంటి వద్దకే గ్రామ వాలింటర్లు వస్తున్నారని సమస్యలను వ్రాతపూర్వకంగా వినతులు అందించవచ్చని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోవు ఉగాది నాటికి 25 లక్షల ఇండ్లు, ఇంటి పట్టాలు అర్హత గల పేదలకు అందించాలని నిర్ణయించారని తెలిపారు. ప్రతి గ్రామంలో భూమికోసం సర్వే చేస్తున్నారని ఇంటి స్థలాలకు అవసరమైన స్థలం రెవెన్యూ అధికారులు గుర్తించే పనిలో ఉన్నారని అన్నారు. అక్టోబర్ 2 నుండి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారభం కానున్నది, గ్రామసచివాలయ ఉద్యోగుల నియామక పరీక్ష