ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికింది ప్రజాప్రతినిధులు, అధికారులు

అంతిమతీర్పు. 24.8.2019


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  స్వాగతం 


 తిరుపతి, ఆగస్టు 24 : తిరుమల శ్రీవారి దర్శనార్థం శనివారం సాయంత్రం  7 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వి.సుబ్రమణ్యం గారికి  సాదర స్వాగతం లభించింది. ప్రభుత్వ విప్ మరియు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్త, నగరపాలక కమిషనర్ పి.ఎస్.గిరీషా, తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, ఇంటలిజెన్స్ ఎ.ఎస్.పి.స్వామి ఎయిర్ పోర్ట్ టర్మీనల్ మేనేజర్ మణిదీప్, తహశీల్దార్ లు చంద్రమోహన్, రంగస్వామి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమల వెళ్ళి రాత్రి బస చేయనున్నారు.