రూ.19,20,000 విలువగల కార్లు,మోటార్ బైక్ ల దొంగలను పట్టుకున్న భవనీపురారం పోలీసులు

అంతిమతీర్పు.24.8.2019


పత్రికా ప్రకటన
తేది. 24-08-2019. 1) పోలీస్ స్టేషన్ 
భవానీపురం 2) క్రైమ్ నెంబర్, సెక్షన్ ఆఫ్ లా
373, 431,527&5512019, సెక్షన్ 379
ఐపిసి 3) నేరస్థలం
భవానీపురం పోలీస్ పరిధిలో 4) విచారణ అధికారులు మరియు సిబ్బంది : భవానీపురం ఇన్ స్పెక్టర్ శ్రీ డి.మోహన్ రెడ్డి
క్రైమ్ ఎస్.ఐ శ్రీ వి.కృష్ణబాబు మరియు సిబ్బంది ఎమ్.డి.మస్తాన్ (హెచ్ సి-1526), కె.శ్రీనివాసరావు (హెచ్సి-446), కె.నాగేంద్ర
(హెచ్సి-625)డి.నాగేంద్ర (పిసి-2817), 5) నేర పరిసోధన
: నేరస్థలంలో దొరికిన ఆధారాలు, సిసిటివి ఫుటేజ్
మరియుటవర్ డేటా 6)అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు :1) కృష్ణాజిల్లా, ఘంటసాలకు చెందిన తాతా ప్రసాద్
అలియాస్ మామిళ్ళపల్లి సెసిధర్.(35 సం||) 2)విజయవాడ, భవానీపురం, ఆర్.టి.సి వర్క్షాపు
రోడ్డుకు చెందిన నామాల నాగరాజు.(27 సం||) 3) కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట మండలం, గౌరవరంకు | చెందిన బానావత్ సురేష్ (28 సం||) 4) కృష్ణాజిల్లా, కంచికచర్ల మండలం, హనుమాన్ పేటకు
చెందిన దొడ్డక గోవర్ధన్. (25 సం||) 5) తమిళనాడు రాష్ట్రం, దిండిగల్ జిల్లా, తాడిగొంబుకు
చెందిన పెరియాస్వామి మారిముత్తు, (38సం.) 7) స్వాధీనం చేసుకున్న సొత్తు
: రూ.19,20,000/- విలువగల 10 కార్లు, 3మోటారు
సైకిళ్ళు 8) నేరం చేసే విధానం
: పగటి మరియు రాత్రి సమయాల్లో కార్లలో సంచరిస్తూ పార్క్చేసి ఉన్న కార్లను మరియు బైక్లను నిశితంగా పరిశీలించి ఎవరికీ అనుమానం రాకుండారాత్రి సమయంలో కారు సైడు ఉన్నటువంటి అద్దాలను పగులగొట్టి కారు దొంగతనాలను మరియు బైకులకు వేసిన హ్యాండిల్ లాక్ ను విరగకొట్టుట ద్వారా నేరాలకు పాల్పడతారు.
అంతరాష్ట్ర కార్లు మరియు మోటారు సైకిళ్ళ చోరీలకు పాల్పడిన ఐదుగురు ముఠా
సభ్యులు అరెస్ట్ వారి వద్ద నుండి 13 కేసుల్లో సుమారు రూ. 19.20లక్షల విలువ చేసే 10 కార్లు, 3మోటారుసైకిళ్ళు స్వాధీనం
ఈ మధ్య కాలంలో నగరంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ సి. హెచ్.ద్వారకా తిరుమలరావు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, దొంగతనాల నియంత్రణ నిమిత్తం పోలీసు గస్తీని ముమ్మరం చేయడంతో పాటు పాత నేరస్థులు, జైలు నుండి విడుదలైన నేరస్తులు మరియు అనుమానాస్పద వ్యక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో వినూత్నంగా ప్రవేశపెట్టిన చేరువ వాహనాల ద్వారా ప్రజలకు వివిధ నేరాల గురించి అవగాహన కలిగించి వారిని అప్రమత్తం చేయడం ద్వారా నేరాల నియంత్రణకు కృషి చేయడం జరుగుతుంది.
ఈ నేపధ్యంలో విజయవాడ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పార్కింగ్ చేసిన కార్లను మరియు మోటారు బైక్ల దొంగతనాలకు పాల్పడిన నిందితుల గురించి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి లా ఆర్డర్-2 డిసిపి శ్రీ విజయరావు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఏడిసిపి-2 శ్రీ ఎల్.టి. చంద్రశేఖర్ గారు మరియు వెస్ట్ జోన్ ఏసిపి శ్రీ సుధాకర్ గారి స్వీయ పర్యవేక్షణలో భవానీపురం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ శ్రీ డి.మోహన్ రెడ్డి, భవానీపురం ఎస్.ఐ శ్రీ కృష్ణ బాబు మరియు సిబ్బందితో అందిన సమాచారం మేరకు ది.23.08.2019న విజయవాడ, భవానీపురం మైలురాయి సెంటర్ వద్ద అనుమానంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image