ఇంద్రారెడ్డి ని కలిసిన నారా నాయకులు

*విద్యారంగం ద్వారా జర్నలిజం మూలాలను బ్రతికించాలని తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ని కోరిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) నాయకులు*


హైదరాబాద్:


జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ని కలసి విద్యారంగం ద్వారా జర్నలిజం మూలాలను కాపాడాలని కోరుతూ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) వినతిపత్రాన్ని అందచేసి సమస్యలపై చర్చించారు..



ఈ సందర్భంగా ఎన్.ఏ.ఆర్.ఏ ఫౌండర్ మరియు జాతీయ అధ్యక్షులు సురేంద్ర బాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వాల పరంగా కానీ, యాజమాన్యాల పరంగా కానీ ఎలాంటి ఆర్థిక భరోసా లేదని జర్నలిస్టులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ పిల్లల్ని కనీసం చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారని,జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అని సురేంద్రబాబు అభిప్రాయపడ్డారు.జర్నలిస్ట్ పిల్లల విద్యకు సంబంధించిన అంశంపై ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖామాత్యులు సబితా ఇంద్రారెడ్డి ని కలవడం జరిగిందని,అక్రిడేషన్ తో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరి ప్రైవేటు విద్యాలయాల్లో పిల్లలకు ఉచిత విద్యను కల్పించాలని మంత్రిని సురేంద్రబాబు కోరారు.ప్రైవేట్ విద్యాలయాల్లో ఉచిత విద్యకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఒకటే జీవోను విడుదల చేయాలని,ఆరవ తరగతి నుంచి పి.జి వరకు జర్నలిజంకు సంబంధించి ఒక చాప్టర్ పెట్టి జర్నలిజం మూలాలను బ్రతికించి జర్నలిజం విలువలను కాపాడాలని, కేజీ నుంచి పీజీ వరకు వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని మంత్రిని సురేంద్రబాబు కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర వ్యవస్థకు ఊపిరి వంటిది.అలాంటి పాత్రికేయ వృత్తిని ఊపిరిగా భావించి జర్నలిస్టులు తమ ప్రాణాలను,కుటుంబాలను సైతం పణంగా పెట్టి సమజాశ్రేయస్సు కొరకు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.జర్నలిస్టులు ఆర్థికంగా,వృత్తి పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అలాంటి వారి శ్రేయస్సు కొరకే “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్” (ఎన్.ఏ.ఆర్.ఏ) నిరంతరం పోరాడుతుందని అన్నారు.ఈ పోరాటంలో భాగంగా అందరి సహకారాన్ని తీసుకొని ఐకమత్యంగా జర్నలిస్టుల హక్కులను కాపాడుకుంటామని సురేంద్ర బాబు తెలిపారు.



నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు ఇచ్చిన డిమాండ్లపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారు. మీరు ఇచ్చిన డిమాండ్ లను క్షుణ్ణంగా పరిశీలించి మీ హక్కులు కాపాడి, మీకు పూర్తి న్యాయం చేస్తానని జర్నలిస్ట్ నాయకులకు ఆమె భరోసా ఇచ్చారు.



జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కు ఎన్.ఎ.ఆర్.ఎ ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు కృతజ్ఞతలు తెలియ చేసారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని కలసిన వారిలో జాతీయ అధ్యక్షులు సురేంద్ర బాబు తో పాటు దేవేంద్ర, శ్రీరాఘవన్, రఫిఉద్దీన్, సతీష్ రెడ్డి,రామకృష్ణ, పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image