హ‌ర్షం వెలిబుచ్చిన ప్ర‌ధాన మంత్రి  

హ్యూస్ట‌న్ లో సెప్టెంబ‌ర్ 22 వ తేదీ నాడు జ‌రుగ‌నున్న భార‌తీయ స‌ముదాయం కార్య‌క్ర‌మం లో అధ్య‌క్షుడు మాన్య శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ పాలు పంచుకొంటున్నందుకు హ‌ర్షం వెలిబుచ్చిన ప్ర‌ధాన మంత్రి
 
సెప్టెంబ‌ర్ 22 వ తేదీన టెక్సాస్ లోని హ్యూస్ట‌న్ లో 'హౌడీ మోదీ' పేరిట జ‌రుగనున్న ఒక ప్ర‌త్యేక సాముదాయక కార్య‌క్ర‌మాని కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్య‌క్షుడు మాన్య శ్రీ డోనాల్డ్ జె. ట్రంప్ హాజ‌రు అవుతారన్న వార్త ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హ‌ర్షాన్ని వెలిబుచ్చారు.  యుఎస్ అధ్య‌క్షుడు ఈ కార్య‌క్ర‌మాని కి రానుండ‌టం యుఎస్ఎ కు మ‌రియు భార‌తదేశాని కి మ‌ధ్య గ‌ల ప్ర‌త్యేక మైత్రి యొక్క ప్రాముఖ్యాన్ని చాటి చెప్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
 
మాన్య శ్రీ ట్రంప్ ఈ కార్య‌క్ర‌మాని కి త‌ర‌లి రానుండ‌టం ఒక ప్ర‌త్యేక‌మైన చొర‌వ ను తీసుకోవడమే అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఇది భార‌త‌దేశం-యుఎస్ ద్వైపాక్షిక సంబంధం యొక్క శ‌క్తి ని సూచిస్తోంది. అంతే కాక అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ కు మరియు అమెరికా స‌మాజాని కి భార‌తీయ స‌ముదాయం అందిస్తున్న‌ తోడ్పాటు కు గుర్తింపు గా కూడా నిల‌వ‌బోతోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.