తెలంగాణలో మళ్లీ టీడీపీని పునర్ నిర్మిస్తా
నూతన నాయకత్వం టీడీపీకి అవసరం
119 నియోజకర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తా
నాయకులు పోతుంటారు.. కానీ కార్యకర్తలే టీడీపీకి బలం
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ముఖ్యనేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో చంద్రబాబు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్ నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన ముఖ్యనేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో నూతన నాయకత్వం టీడీపీకి అవసరం ఉందన్నారు. నాయకత్వ లోపాన్ని సరిదిద్దుకుందామన్నారు. 119 నియోజకర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్‌లోనేనని గుర్తుచేశారు. నాయకులు పోతుంటారు.. కానీ కార్యకర్తలే టీడీపీకి బలమని చెప్పుకొచ్చారు. దాదాపు 9 నెలల తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం కురిపించారు.
తెలంగాణలో మళ్లీ టీడీపీని పునర్ నిర్మిస్తా : చంద్రబాబు