బొత్స మంత్రి పదవికి అనర్హుడు:వై.వి.బి.రాజేంద్రప్రసాద్

తేది. 09-09-2019


 


బొత్సను అడ్డుపెట్టుకొని రాజధానిపై సీఎం జగన్‌ విషప్రచారం


- తన శాఖకు సంబంధించిన చిన్న విషయం కూడా తెలుసుకోలేని బొత్స మంత్రి పదవికి అనర్హుడు


           విలేకరుల సమావేశంలో  : వైవీబీ రాజేంద్రప్రసాద్‌


మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై విషం కక్కుతూ నిత్యం దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి వైవిబి రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. సోమవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... మొన్నటివరకు రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. రాజధాని  ప్రాంతం ముంపుకి గురౌతుందన్నారు. తరువాత రాజదానిలో రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ఇప్పుడు తాజాగా రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు కాబట్టి ఎలా పరిపాలన చేస్తాం అని అంటున్నారు. అమరావతిపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం గెజిట్‌ను ఇవ్వడం జరిగిందని, 2014 డిసెంబర్‌ 30వ తేదిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారని వెల్లడించారు. అంతేకాకుండా అదేరోజున జీవో నెంబర్‌ 254ను విడుదల చేసి కోర్‌ కేపిటల్‌ ప్రాంతాన్ని అందులో ప్రస్తావించడం జరిగింది.


బొత్స సత్యనారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తన శాఖకు సంబంధించిన అమరావతి రాజధానిపై, కోర్‌ కేపిటల్‌ ప్రాంతంపై సీఆర్‌డీఏపై తెలుసుకోకపోవడం వారి అజ్ఞానానికి పరాకాష్ట అన్నారు. ప్రభుత్వంలో ఒక కీలకమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సమంజసంకాదు. బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే ఆయన చేత సీఎం జగన్‌ మాట్లాడిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. తన శాఖకు సంబంధించి ఒక చిన్న విషయం కూడా తెలుసుకోకుండా ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు ఆయన రాష్ట్ర ప్రలకు క్షమాపణ చెప్పాలి. ఆయన చేస్తున్న ఈ విషప్రచారం కారణంగా ఆయన మంత్రిగా అనర్హుడన్నారు. టీడీపీ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందని పుస్తకాలు ప్రచురించారు. ఒక్క రాజధాని అమరావతిలోనే రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అందులో పేర్కొన్నారు. కానీ వైసీపీ అధికారం చేపట్టి 100 రోజులైనా ఒక్క రూపాయి అవినీతిని కూడా ఎందుకు నిరూపించలేకపోయిందని ప్రశ్నించారు. రూ.2లక్షల కోట్ల అవినీతి జరిగిందని అబద్దాలు ప్రచారం చేస్తున్న వైసీపీ కనీసం 2 కోట్ల అవినీతిని కూడా బయటపెట్టలేకపోయినందుకు చెంపలేసుకొని చంద్రబాబునాయుడుగారివద్ద క్షమాపణ కోరాలన్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని తేటతెల్లమైందన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై బొత్స సత్యనారాయణ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 2011లో బాలకృష్ణ వియ్యంకుడు తుళ్లూరుకి వంద కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేటలో 500 ఎకరాల భూమి కొన్నారని, అది టీడీపీ ప్రభుత్వం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వల్లే జరిగిందని ఆరోపించడంలో అర్థంలేదన్నారు. 2011కు అమరావతి రాజధానికి ఏంటి సంబంధం అని, అప్పుడు రాష్ట్రం విడిపోతుందని ఎవరూ కలగనలేదన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరం లక్ష రూపాయల లెక్కన ఇస్తే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2015లో దాన్ని రద్దు చేసి ఎకరం రూ.16 లక్షల లెక్కన ఇచ్చినా ఆ భూములను వాళ్లు తీసుకోలేదని, ఇప్పటికీ ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. అలాగే సుజనా చౌదరి కూడా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ అబద్ధపు ప్రచారాలను మానుకొని పరిపాలనపై దృష్టి పెట్టి ప్రజలకు ఉపయోగపడాలని హితవు పలికారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image