సివిల్ సర్వీసెస్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు :కలెక్టర్ ఇంతియాజ్

సివిల్ సర్వీసెస్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు 
* కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఎ .ఎండి.ఇంతియాజ్ 
* పరీక్షల నిర్వహణపై అధికార్లతో కలెక్టర్ సమీక్ష‌
విజయవాడ: విజయవాడలో ఈ నెల 20 నుండి 29వ తేదీ వరకు జరగనున్న సివిల్ సర్వీసెస్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ .ఎండి.ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో గురువారం సివిల్ సర్వీసెస్ పరీక్షల నిర్వహణపై అధికార్లతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఈ నెల 20, 21, 22, 28 మరియు 29 వ తేదీలలో విజయవాడలో జరుగుతాయన్నారు. విజయవాడ మాచవరంలోని యస్ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వాటిలో ఒక కేంద్రాన్ని విభిన్న ప్రతిభావంతులకు కేటాయించామన్నారు. పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ తో పాటు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని, వాటిని భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టరు ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు జిల్లా రెవెన్యూ అధికారిని అసిస్టెంట్ కోఆర్డినేటింగ్ సూపర్ వైజరుగాను , విజయవాడ సబ్ కలెక్టరును లోకల్ ఇన్ స్పెక్టింగ్ అధికారిగాను , విజయవాడ నార్త్, ఈస్ట్ తాహశీల్దార్లను లైజన్ అధికార్లుగా నియమించడం జరిగిందన్నారు. వీరితోపాటు ముగ్గురు జిల్లా అధికారులను అసిస్టెంట్ సూపర్ వైజర్లుగా నియమించడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు 14 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్షా పత్రాలకు పటిష్టమైన భద్రత కల్పించాలని పోలీసు అధికారులను కలెక్టరు ఆదేశించారు. పరీక్ష హాలు ఆవరణలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేయాలన్నారు. అభ్యర్థుల సౌక్యార్ధం ఈ నెల 20వ తేదీన ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు కె.మాధవీలత, డిఆర్ఒ ఏ.ప్రసాద్, జిల్లా పంచాయితీ అధికారి కె.అరుణ, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి మూర్తి, ఇన్‌ఛార్జి సబ్-కలెక్టరు చక్రపాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
పౌష్ఠిక ఆహారం అందజేత
Image
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
Image