ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఇకలేరు
తెదేపా సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బసవతారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం తీవ్ర గుండె పోటుకు గురైన ఆయన్ను.. కుటుంబ సభ్యలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే కోడెల మృతిని ఆస్పత్రి వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రచారం సాగుతోంది. అయితే గుండెపోటుతోనే కోడెల కన్నుమూసినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు.
ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఇకలేరు