సర్టిఫికేట్ ఇవ్వని కాలేజికి ఎస్.పి..మొట్టికాయలు


 *మచిలీపట్నం* : ప్రతి సోమవారం  నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ఈ రోజు ఫిర్యాదుదారులతో కిటకిట లాడింది. 


జిల్లా SP కి ఫిర్యాదులు ఇచ్చేందుకు సుదూర ప్రాంతాల నుండి వచ్చి పిర్యాదులు సమర్పించారు. వచ్చిన పిర్యాదుదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా అన్ని  సదుపాయాలు కల్పించారు.  


పిర్యాదు రాయడం రానివారి కొసం help desk ఏర్పాటు చేసేందుకు సిబ్బందిని కేటాయించారు. అనారోగ్య కారణాలతో ఉన్నవారి కోసం medical camp ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.


 అల్పాహారం,మంచినీరు ఎర్పట్లు చేసారు. SP గారు పిర్యాదులు స్వీకరించే క్రమంలో  గత సోమవారం స్పందన కార్యక్రమంలో అర్జి ఇవ్వగా ఒకరోజులొనే వారి సమస్యను పరిష్కరించి నందుకు గాను  ఇద్దరు మహిళలు వచ్చి ఈ రోజు SP ని కలిసి కృతఙ్ఞతలు తెలిపారు.


 
గత వారం మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెం కు చెందిన రిజ్వనా అనే మహిళ తన కుమార్తెను మచిలీపట్నం  నందు గల ఒక ప్రైవేట్ కళాశాల లొ చెర్పించగా తన ఆర్డిక స్తితి కారణంగా మరొక కళాశాల లొ చేర్చడానికి వారిని ఒరిజినల్ certificats ఇవ్వమనగా యాజమన్యం ఇబ్బంది పెడుతున్నారని పిర్యాదు మేరకు   SP  చిలకలపుడి SI ని ఆదేశించగా SI  వెళ్లి కళాశాల యాజమన్యం తొ మాట్లాడి కేవలం ఒక రోజు లొనె సమస్య ను పరిష్కరించడం జరిగినందుకు ఈ రోజు ఆ మహిళ వచ్చి SP కి మిఠాయిలు అందించి కృతఙ్ఞతలు తెలిపారు.