అక్రమకేసులే కారణం: ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ .

🙏✌💐✌🙏
కోడెల గారి మృతికి ప్రభుత్వవేధింపులు, అక్రమకేసులే కారణం: ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ .
🙏✌💐✌🙏
మాజీ మంత్రి , మాజీ స్పీకర్ గా మన రాష్ట్రానికి సేవలందించిన 
 *కోడెల శివప్రసాద్* గారి మరణం తీవ్రంగా కలచివేసిందన్న *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్* , ఉయ్యూరులో తన కార్యాలయంలో *కోడెల గారి చిత్ర పటానికి* పూలమాలల తో నివాళులర్పించి *శ్రద్దాంజలి* ఘటించారు.
🙏✌💐✌🙏
ఈ కార్యక్రమంలో *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్* గారు మాట్లాడుతూ,
సీనియర్ రాజకీయవేత్త, ఆత్మీయంగా పలకరిస్తూ ఎంతో మందికి డాక్టరుగా సేవలందించిన డా. కోడెల శివప్రసాదరావు గారు
బలవన్మరణం చేసుకోవటం
రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు, *అక్రమకేసులు* తట్టుకోలేకేనని,
 *ఆత్మాభిమానం దెబ్బతిని* 
 కోడెల *ఆత్మహత్య* చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరించిందని *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్*  ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.
🙏✌💐✌🙏
కోడెల మృతి *తెలుగుదేశంపార్టీకి* తీరని లోటు.
 *కోడెల* గారు *పంచాయతీరాజ్* శాఖ మంత్రిగా ఉన్న సమయంలో *సర్పంచుల* హక్కులసాధన *పోరాటంలో* తీవ్రవిమర్శలు చేసిన మమ్మల్ని కోడెల గారు పుత్రవాత్సల్యంతో హక్కుల సాధనకు సహకరించారని, నాటి నుండి కోడెల  దగ్గర *ఎన్నో విషయాలు* నేర్చుకున్నామన్న *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్*  ఆయన మృతి పట్ల కుటుంబసభ్యులకు తన
 *ప్రగాఢ సంతాపం* తెలియచేస్తున్నాను అన్నారు.
🙏✌💐✌🙏
ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు జంపాన పూర్ణచంద్రరావు గారు, అబ్దుల్ కూద్దూస్ గారు, కొండా ప్రవీణ్ కుమార్, చేదుర్తిపాటి ప్రవీణ్, బాబూ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, జంపన శ్రీను, ఈడే అంజిబాబు, తిరుపతిరావు, జబ్బార్, కరిమిజ్జి రమణ, వల్లూరి కిరణ్, రమేష్, పవన్ తదితర తెదేపా నాయకులు పాల్గొన్నారు.
🙏✌💐✌🙏