లెలెన్ వస్రాలదే భవిష్యత్

 అంతిమతీర్పు. 9.9.2019


లినెన్ వస్త్రాలదే భవిష్యత్ ... 
* ఏడాదిలో "లినెన్ హౌస్" వంద స్టోర్లు లక్ష్యం..
* తెలుగు రాష్ట్రాల్లో మొదటి నెలలో 10 స్టోర్లు తెరుస్తాం
* లినెన్ ఫియస్టా సిఈఓ, బిజినెస్  డెవలప్మెంట్ హెడ్ ఆదిత్య అగర్వాల్ 
, హైదరాబాద్: ఏడాదిలో వంద స్టోర్లు తెరవాలన్న లక్ష్యంతో ఉన్నట్లు లినెన్ ఫియస్టా సిఈఓ, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ ఆదిత్య అగర్వాల్ వెల్లడించారు. మొదటి నెలలో తెలంగాణ, ఏపీలో మొత్తం 10 స్టోర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, ఖమ్మంతో పాటు విజయవాడ, గుడివాడ, ఒంగోలు, విశాఖపట్నం, తణుకు, విజయనగరం, రాజమండ్రి, తిరుపతి నగరాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ బేగంపేటలోని గ్రాండ్ కాకతీయ హోటల్లో బ్రాండ్ అండ్ బిజినెస్ కాన్సెప్ట్ ను ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ తో పాటు పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, సినీనటి, జబర్దస్ట్ ఫేమ్ రష్మీ గౌతమ్, ఫ్రాంఛైసీ నిర్వాహకులు విజయ్ త్రిపురనేని, శ్రీకాంత్ అవిర్నేని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య అగర్వాల్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో లినెన్ ఉత్పత్తులకు విశేష ఆదరణ ఉందన్నారు. లినిన్ ఫర్ ఎవ్విరి వన్ అనే కాన్సెప్ట్తో లినిన్ హౌస్ మార్కెట్లోకి ప్రవేశిస్తోందని, హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ ఆపరేషన్స్ మొదలు పెట్టిందన్నారు. రూ.399 నుంచి రూ.9999 వరకూ ఫ్యాబ్రిక్స్ లభిస్తాయని, రెడీమేడ్ లో కూడా రూ.999 నుంచి రూ.4,999 వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. లినిన్ హౌస్లో 70శాతం లెనిన్ ఫ్యాబ్రిక్, 30 శాతం రెడీమేడ్ వస్త్రాలు లభిస్తాయని, మల్టీబ్రాండ్ లెనిన్ వస్త్రాలు లభించే ఏకైక స్టోర్ ఇదేనన్నారు. మార్కెట్లో దొరికే సాధారణ వస్త్రాలతో పోలిస్తే లినెన్ హౌస్ లో లభించే వెరైటీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక కలవని, దేశ విదేశాల నుంచి లినిన్ తయారీదార్ల వద్ద సేకరించిన వందల వెరైటీలను కస్టమర్లకు అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యంగా లినెన్ హౌస్ పనిచేస్తోందన్నారు. అనంతరం బ్రాండ్ హెడ్ రూపేష్ ఖురానా మాట్లాడుతూ 1986లో బాలేశ్వర్ సింథటిక్స్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించి సూటింగ్స్, పర్టింగ్స్ కోసం లినెన్, కాటన్ ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపారు. మేకిన్ ఇండియా కాన్సెప్ట్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ లినెన్ హౌస్ అనే వస్త్ర సమూహం ప్రారంభమైందని, అద్భుతమైన కలెక్షన్స్ తో పాటు వందల వెరైటీలు లినెన్ హౌస్ సొంతమని, భవిష్యత్ లో భారతదేశం లినెన్ వస్త్రాలకు చిరునామాగా మారబోతోందన్నారు. లినెన్ హౌస్ కు వచ్చే కస్టమర్లకు సరికొత్త షాపింగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ఏడాదికి 36లక్షల మీటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని తాము కలిగి ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో పూర్ణిమ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సిద్ధాంత్ బియానీ తదితరులు పాల్గొన్నారు.