కల్తీ మహమ్మారిని నిర్మలించడం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

 కల్తీ మహమ్మారిని నిర్మలించడం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి.


సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
*కల్తీ మహమ్మారిని ,కల్తీ ఆహార వస్తువుల నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై -మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలి.


ప్రస్తుత ఆధునిక యుగం లో ఆరోగ్యంగా ఉండాలంటే  ముఖ్యంగా గాలి, నీరు, ఆహరం కల్తీ లేకుండా ఉండాలి.సమాజంలో మనం జీవించడానికి  నిత్యం అవసరమైనవి  గాలి ,నీరు, ఆహారం. అయితే వాయు కాలుష్యం వల్ల గాలి ,నీటి కాలుష్యం వల్ల నీరు ,కల్తీ చెయ్యడం వల్ల ఆహర వస్తువులు కలుషితమైపోతున్నాయి.ఇంక ఆరోగ్యం  కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది . కావున వాతావరణ కాలుష్యం వల్ల కలుషిత ఆహారాల వల్ల  ఇప్పటికే విషకోరల్లో చిక్కుకుని  ప్రతి ఒక్కరం అనారోగ్యం పాలు అవుచున్నాము  రోజు రోజు కు మనిషి ఆయుషు కూడ తగ్గిపోతుంది . కొన్ని సందర్బాలలో మనిషికి ఎటువంటి చెడు అలవాట్లు  లేకపోయినప్పటికి వాతావరణ కాలుష్యాలతో ,కల్తీఆహారపదార్థాలతో అనారోగ్యాలకు గురి అగుచున్నారు. శరీరంలో బ్యాక్టీరియల్  ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని సందర్బాలలో మనిషి మృతి చెందుతున్నాడు. కావున కల్తీ మహమ్మారిని  నిర్మూలించడానికి  సమాజంలోని అన్ని వర్గాల వారు మేధావులు, స్వచ్చంద సేవా సంస్ధలు, ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు , అధికారులు, ప్రభుత్వాలు , ప్రజలు ఐకమత్యం తో  కల్తీమహమ్మారిని నియంత్రించాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
వేడుకుంటున్నారు.
ఆరోగ్యం అందరికి అవసరం
*మీరు తినే ఆహారాలలో ఉండే కలుషితాల పై జాగ్రత్త వహించండి*
ఆహార పదార్థాల నిల్వ, రవాణ పద్దతులు మరియు వాటిని పండించే విధానంలో రసాయనాలు అధికంగా వాడటం ,వ్యాపారస్తులు  కల్తీ చెయ్యటం  వంటి ఇతరేతర కారణాల వలన ఆహార పదార్థాలు కలుషితానికి గురవుతున్నాయి. కల్తీ నియంత్రణకు ప్రభుత్వాలకు  ప్రజల సహాయసహకారాలు అందించినప్పుడే సంపూర్ణ కల్తీ నియంత్రణ సాద్యపడుతుంది.
*ఆహార భద్రత  లో కొన్ని జాగ్రత్తలు*
ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహార కలుషితాలను అరికట్టి మరియు శుభ్రమైన ఆహార పదార్థాలను తినాలి. వీటి పైన తగిన శ్రద్ధ చూపకుండా, తెలిసి కల్తీ  ఆహార పదార్థాలను రోజు తింటున్నాము. 100 శాతం శుభ్రమైన మరియు క్రిమిరహిత ఆహార పదార్థాలను పొందలేము. కానీ, కొన్ని పద్దతులను అనుసరించటం ద్వారా ఆహార పదార్థాలలో ఉండే కలుషితాలను దాదాపు నివారించవచ్చని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి తెలిపారు.
ఆరోగ్యకర ఆహార పదార్థాలు పండ్లు లేదా కూరగాయలను తినటానికి లేదా వంటలో వాడటానికి ముందు నీటితో శుభ్రంగా కడగండి. కడగకుండా కూరగాయలను తినకూడదు. అంతేకాకుండా, సురక్షిత ఉష్ణోగ్రతల వద్ద ఆహార పదార్థాలను నిల్వ ఉంచండి.
ఏ రకమైన నీటిని తాగుతున్నారు మరియు వంటలలో వాడుతున్నారనేది చాలా ముఖ్యం. తాగటానికైన, వంటలలోనైన శుభ్రమైన నీటిని వాడటం మంచిది. మీరు శుద్ది చేసిన నీటిని వాడకం పోవటం వలన హానికర రసాయనాలను అనగా సీసం మరియు ప్రమాదకర సుక్ష్మజీవులు (వైరస్ మరియు బ్యాక్టీరియా) మీ శరీరంలో చేరి, చాలా విధాలుగా ఆరోగ్యాన్ని ప్రమాదానికి గురి చేస్తాయి.ఎపుడైనా శుభ్రత ప్రధానంగా ఉండే  దుకాణాలలో ఆహారాలను కొనుగోలు చేయటానికి ప్రయత్నించండి. కాలుష్యం ఎక్కువ లేదా కాలుష్య ప్రాంతాలలో అమ్మే ఆహార పదార్థాలను కొనటం వలన మీరు అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు అధికంగానే ఉన్నాయని సామాజిక కార్యకర్త డోన్ పి .మహమ్మద్ రఫి తెలిపారు
ప్యాక్ చేయని ఆహార పదార్థాలు హానికరమని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఆహార పదార్థాలు కలుషితానికి గురై ఉంటాయి మరియు ఇవి కల్తీకి గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల విషయానికి వస్తే, ఇవి తక్కువగా కలుషితానికి గురవుతాయి మరియు కల్తీ కూడా దాదాపు తక్కువే. మీరు వీటిని కొనే ముందు ప్యాక్ సరిగా ఉందా లేదా అని మరియు లేబుల్పై తయారీ మరియు గడువు తేదీలను చూడటం మరవకండి. కల్తీ(కలుషిత) ఆహార పదార్థాలను తీసుకోవటం వలన దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతారు. స్వతహాగా అవగాహన కలిగి ఉండి, తగిన జాగ్రత్తలను తీసుకోవటం వలన ఆహార సమస్యలకు దూరంగా ఉండవచ్చని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.
కలుషిత ఆహార పదార్థాలను తినటం వలన కడుపు నొప్పి, వాంతులు మరియు విరేచనాలు కలుగుతాయి. వీటితో పాటుగా కలుషిత ఆహారం తీసుకోవటం వలన క్యాన్సర్, నాడీ సంబంధిత రుగ్మతల వంటి దీర్ఘకాలిక వ్యాధుల భారినపడే అవకాశాలు ఉన్నాయి.కొన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు రసాయన మందులను లేదా పురుగు నాశక మందులను అధికంగా కలిగి ఉంటాయి. వీటి పైన తగిన అవగాహన కలిగి ఉండి, రసాయనాలు లేని పండ్లు మరియు కూరగాయలను కొనుగోలు చేయండి. పండ్లు మరియు కూరగాయలను శుభ్రంగా కడగటం లేదా వాటి తోలు తీసివేయటం వంటి తగిన జాగ్రత్తలను తీసుకోవడం వలన మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి సుచించారు.


 
 


 

Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు