అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేయాలి: మంత్రి వనిత

సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిది 
* సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల రూపకల్పన చేయాలి 
* కొన్ని స్వచ్ఛంధ సంస్థలు మద్యపాన నిషేధం అమలుకు కృషి చేస్తుండటం గర్వించదగ్గ విషయం 
* అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేయాలి
* రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత
అమరావతి: సమాజంలోని కడుపేద వ్యక్తి సైతం సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయమని, అందుకు అనుగుణంగా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల రూపకల్పన చేయాలని  స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంధ సేవా సంస్థలను ఉద్దేశించి మంత్రి తానేటి వనిత మాట్లాడారు. జాతి పునర్నిర్మాణంలో సేవ ఒక భాగం కావాలని, సేవా భావం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని తెలిపారు. ప్రస్తుత సమాజంలో సేవా భావం ప్రతి ఒక్కరిలో పెరిగిందని ఆమె వెల్లడించారు.  పలు స్వచ్ఛంధ సంస్థలు వృద్ధాశ్రమాలు, వికలాంగుల నిలయాలు, అనాధ శరణాలయాలు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, గ్రంథాలయాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, కోచింగ్‌ సెంటర్లు ఇలా ప్రతీది నడుపుతూ సమాజాభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు.  దుఖితులు, పీడితులు, అణగారిన వర్గాలు కోసం ప్రతి స్వచ్ఛంధ సంస్థ పనిచేయాలని సూచించారు. మన సమాజంలో దివ్యాంగులు, మానసిక వికలాంగులు, మూగ, బధిర అలాగే చలన సంబంధమయిన లోపం కలవారు అనేక మంది ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనకు భగవంతుడు అన్నీ ఇచ్చారు మరి వాళ్ల సంగతి ఏమిటి? అని  ప్రశ్నించి ఆలోచింపజేశారు.  వీళ్లందరిలో ఆత్మన్యూనతా భావం లేకుండా చేయాలని ఎన్జీవోలకు దిశానిర్ధేశం చేశారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వారు తమ అంగవైకల్యాలను జయించి జీవితంలో ముందుకు సాగేలా చేయాలని కోరారు. సేవను పొందేవారు సైతం సేవ చేసేవారిగా మార్చాలని అందుకు తగిన ప్రేరణ నింపాలన్నారు. ఏ రక్తసంబంధం లేని వారిని స్వచ్ఛంధ సంస్థలు చేరదీయడం గొప్ప విషయమని అభినందించారు. అయితే సామాజికబాధ్యత పేరుతో  ఒకట్రెండు స్వచ్ఛంధ సంస్థలు చేస్తున్న తప్పులు, పొరపాట్ల వల్ల మిగతా సంస్థలపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. సంపాదించేదాంట్లో కొంత సేవ చేయాలనుకోవడం మంచి పరిణామమన్నారు. సమాజంలో పలువురు ఏదో ఒక రూపంలో సేవ చేస్తుండటం అభినందనీయమన్నారు.  కష్టాలను దూరం చేసేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించి వారికి తోడు నీడగా, ఆపన్నహస్తం అందించే విధంగా పలు స్వచ్ఛంధ సంస్థలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందజేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున చేయగలిగింది ఏది ఉన్నా అది చేస్తామని సీఎం పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.  మంచి చేయడానికి ముందుకొచ్చే స్వచ్ఛంధ సంస్థలకు అవసరమైతే నిధులు అందజేస్తామని మంత్రి అన్నారు. సామాజిక బాధ్యత పేరుతో నిధులు పక్కదోవ పట్టినా, దుర్వినియోగం చేసినా సదరు సంస్థలపై, కారణమైన వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వమిచ్చే సహాయంతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కొన్ని స్వచ్ఛంధ సంస్థలు మద్యపాన నిషేధం అమలుకు కృషి చేస్తుండటం గర్హనీయమన్నారు. 
                                స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె. దమయంతి మాట్లాడుతూ మంత్రి ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని స్వచ్ఛంధ సంస్థలను కలిపించే ప్రయత్నం చేశామన్నారు. సుమారు 117 ఎన్జీవోలు మీటింగ్ కు హాజరవటం మంచి పరిణామమన్నారు. రాష్ట్రంలోని పలు స్వచ్ఛంధ సంస్థలు బాగా పని చేస్తున్నాయని తెలిపారు.  ఈ సందర్భంగా కొన్ని స్వచ్ఛంధ సంస్థలు మద్యపాన నిషేధం అమలుకు కృషి చేస్తుండటం గర్వించదగ్గ విషయమన్నారు. మత్తుపానియాలు మాన్పించేలా, చెడు అలవాట్లు తగ్గించేలా మరికొన్ని ఎన్జీవోలు ఆ దిశగా అవగాహన సదస్సులు కల్పించడంతో పాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ రక్తసంబంధం లేని వ్యక్తుల కోసం అహర్నిశలు కష్టపడుతూ వారిని చేరదీస్తున్న స్వచ్ఛంధ సంస్థలను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి చేరే విధంగా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు డా.కిషోర్ కుమార్, జనరల్ మేనేజర్ రవిప్రకాష్, 13 జిల్లాల శాఖాధికారులు,  రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 117 స్వచ్ఛంధ సేవా సంస్థలు, రాష్ట్రీయ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్
Image