సంతాప సందేశము

సంతాప సందేశము


ఎపి శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అకాల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ ఒక సందేశంలో సంతాపం తెలిపారు. శివ ప్రసాద రావు ఎమ్మెల్యేగా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారని, ప్రజలకు అంకిత భావంతో సేవ చేసారని ప్రస్తుతించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా శ్రీ శివప్రసాద రావు చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని గవర్నర్ తెలిపారు.  శివప్రసాద్ కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాడ సానుభూతిని, హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు.