పల్నాడు పోరాట యోధుడిని కోల్పోయింది : యనమల
గుంటూరు : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి వార్త విన్న టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్నాడు పోరాట యోధుడిని కోల్పోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వేధింపులతోనే కోడెల మృతి చెందారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కోడెల, ఆయన కుటుంబసభ్యులపై ప్రభుత్వం కేసులు పెట్టి, వేధింపులకు గురిచేసిందని యనమల ఆరోపించారు. పార్టీ కోసం కోడెల చివరివరకు పరితపించారని యనమల పేర్కొన్నారు.
పల్నాడు పోరాట యోధుడిని కోల్పోయింది : యనమల