11–09–2019
అమరావతి
అమరావతి: స్పందనపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమీక్ష
స్పందనలో భాగంగా సమస్యలు పరిష్కరించామని చెప్తున్న వారికి రాండమ్‌గా కాల్ చేసి అభిప్రాయాలు స్వీకరించాం: సీఎం
వీరిలో 59శాతం మంది తమ సమస్యలను బాగానే పరిష్కరించారని సంతృప్తి వ్యక్తంచేశారు : సీఎం
మరో 41 శాతం మంది ఆ సమస్యలను మరింత మెరుగ్గా పరిష్కరించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు : సీఎం
జిల్లాల నుంచి ఎంపిక చేసుకున్న కొంతమంది అధికారులను పిలిపిస్తాం: సీఎం
వినతుల్లో భాగంగా అధికారులు ఇచ్చిన సమాధానాలను వారికే చూపిస్తాం: సీఎం
ఏ తరహా సమాధానాలు ఇచ్చారో చూపించి వర్క్‌షాపు నిర్వహిస్తాం: సీఎం
ఎమ్మార్వో, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు... అందర్నీ పిలిపించి ఈ తరహా ప్రక్రియ చేపడతాం: సీఎం
మానవత్వం అనేది ప్రతి చర్యలో, ప్రతి అక్షరంలో కనిపించాలి: సీఎం
లేకపోతే వ్యవస్థ ఎందుకు నడుస్తుందో.. అర్థం కాని పరిస్థితి వస్తుంది: సీఎం
కలెక్టర్లు అంతా ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడాలని కోరుతున్నా : సీఎం
వినతులు ఇచ్చే ప్రజలపట్ల కొందరు సిబ్బంది సవ్యంగా ప్రవర్తించడంలేదన్న ఫిర్యాదులూ వస్తున్నాయి: సీఎం
ఇలాంటి కేసులు 2 శాతం నుంచి 5 శాతం వరకూ ఉన్నాయి: సీఎం
దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని అధికారులకు చెప్పండి: సీఎం
వాళ్లు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థాయికి వచ్చాం: సీఎం
మనం సేవకులమే కాని, పాలకులం కాదు :సీఎం
వినతులు, సమస్యలు నివేదించేవారి పట్ల చిరునవ్వుతో ఆహ్వానించాలి: సీఎం
కలెక్టర్లకు, అధికారులకు ఈ విషయాలన్నీ తెలిసినవే : సీఎం
కాని పనిభారం వల్లో, మరే ఇతర కారణాలవల్లో ఇలాంటివి తలెత్తవచ్చు: సీఎం
ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను : సీఎం
స్పందన స్ఫూర్తి తగ్గకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం
గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న విషయాన్ని మరిచిపోవద్దన్న సీఎం
అలసత్వం వహించవద్దని, ఆమేరకు యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించాల్సిన అవసరం ఉందని కలెక్టర్లకు సీఎం సూచన
దిగువస్థాయి అధికారులకు కలెక్టర్లు మార్గ నిర్దేశం వహించాలన్న సీఎం
గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి పరీక్షలను అద్భుతంగా నిర్వహించారని కలెక్టర్లకు సీఎం ప్రశంసలు
పొరపాట్లు లేకుండా నిర్వహించినందుకు అభినందనలు తెలిపిన సీఎం
వర్షాలు కారణంగా జ్వరాలు వస్తున్నాయన్న సీఎం
ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య విభాగాలు దృష్టిపెట్టేలా చేయాలన్న సీఎం
ఆస్పత్రులు, ఇతర ప్రాంతాల్లో కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలన్న సీఎం
అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న వైయస్సార్ కంటివెలుగుపైనా దృష్టిపెట్టాలన్న సీఎం
ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్న సీఎం
అక్టోబరు 2 న గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభిస్తున్నాం : సీఎం
డిసెంబర్ 1 నుంచి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్‌కార్డులు ఇవ్వాలి: సీఎం
ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: సీఎం
ఈ కార్యక్రమం వల్ల కలెక్టర్ల పేరు, అధికారుల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న సీఎం
కనీసం ప్రతి జిల్లాలో 2 లక్షల మందికి ఇళ్లస్థలాలను ఇస్తున్నాం: సీఎం
ఇన్ని లక్షలమంది జీవితాలను మార్చే అవకాశం అధికారులకు, నాకు వచ్చింది: సీఎం
ఫోకస్ పెట్టాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా : సీఎం
రాష్ట్రంలోని 1,45,72,861 కుటుంబాల్లో 1,21,62,651 ఇళ్లను వాలంటీర్లు వెరిఫికేషన్ పూర్తిచేశారని చెప్పిన అధికారులు
ఈ వారానికి పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ పూర్తవుతుందన్న అధికారులు
ఇప్పటివరకూ 23,83,154 మందిని ఇళ్లస్థలాలకోసం లబ్ధిదారులుగా గుర్తించామన్న అధికారులు
పట్టణ ప్రాంతాల్లో 3772 ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 25,822 ఎకరాలు అందుబాటులో ఉందన్న అధికారులు
అన్నీ పూర్తయ్యాక తుది గణాంకాలు నివేదిస్తామని చెప్పిన అధికారులు
సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీక్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు: సీఎం
ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయండి: సీఎం
మార్గదర్శకాలను కలెక్టర్లకు వివరించిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు
వాహన యజమాని భార్య అయినా, భర్త అయినా పర్వాలేదని మార్గదర్శకాలు
దరఖాస్తులు ఇవ్వడానికి ఆఖరు తేదీ సెప్టెంబరు 25
సెప్టెంబరు 30 లోగా వెరిఫికేషన్, అప్ లోడింగ్
రవాణాశాఖ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు
దరఖాస్తులు స్వీకరించేటప్పుడు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా వీలైనన్ని కౌంటర్లు పెట్టాలని సూచన
విశాఖ, విజయవాడల్లో ఆటోలు, ట్యాక్సీలు ఎక్కువ కాబట్టి.. అక్కడ ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి
మీ సేవ ద్వారా దరఖాస్తులు ఇచ్చుకునే అవకాం ఉందన్న సీఎం
నెట్‌సదుపాయం ఉన్న ఎక్కడ నుంచైనా దరఖాస్తు నింపవచ్చన్న అధికారులు
మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా దరఖాస్తును నింపవచ్చన్న అధికారులు
దరఖాస్తులు ఆమోదం పొందగానే అక్టోబరు 4 నుంచి పంపిణీ
అక్టోబరు 5న రశీదులు లబ్ధిదారులకు అందించాలన్న సీఎం
అక్టోబరు 15 నుంచి రైతు భరోసాపై సీఎం సమీక్ష
అర్హత ఉన్నవారికి తప్పకుండా ప«థకం అందాలి: సీఎం
పారదర్శకంగా ఈ పథకం అందరికీ అందాలి: సీఎం
ఇసుక సమస్యపై కలెక్టర్లతో మాట్లాడిన సీఎం
వరదల కారణంగా రీచ్‌లు నిర్వహించలేని పరిస్థితి ఉందన్న సీఎం
వరదలు తగ్గగానే వెంటనే రీచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం
స్టాక్‌యార్డుల్లో నిల్వలు పెంచేలా చూడాలన్న సీఎం
ఇసుకలో మాఫియా, దోపిడీ లేకుండా చేశామన్న సీఎం
వీలైనంత తక్కువ రేటుకు పారదర్శకంగా ఇసుక పంపిణీచేస్తున్నామన్న సీఎం
కాని ఇసుకకొరత కారనంగా పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు పడుతున్నాయన్న సీఎం
వరదలు తగ్గగానే ఇసుక సమస్యను పరిష్కరించాలన్న సీఎం
వరదలు తగ్గగానే చురుగ్గా ఇసుకను అందుబాటులోకి తెస్తామన్న కలెక్టర్లు
ప్రతి కలెక్టరేట్‌లో ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులకోసం ప్రత్యేక సెల్స్‌ను ఏర్పాటచేయాలన్న సీఎం
వీలైతే ఆయా సంఘాలకు చెందిన ప్రతినిధులను ఆసెల్‌లో ఉంచాలన్న సీఎం
గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో రూ.5వేల ప్రత్యేక సహాయంపై సీఎం ఆరా
ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయని వెంటనే పంపిణీ ప్రారంభిస్తామన్న ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు
వరద బాధిత ప్రాంతాల్లో మళ్లీ బియ్యాన్ని పంపిణీచేస్తున్నట్టు వెల్లడించిన కలెక్టర్లు
కృష్ణా వరదలపై కూడా సీఎం ఆరా
విజయవాడ నగరంలో పునరావాస శిబిరాలు ఏర్పాటుచేస్తున్నామన్న కలెక్టర్ ఇంతియాజ్
వరద బాధితుల పట్ల ఉదారంగానే ఉండాలని సీఎం ఆదేశం