పాలన లేదు - ప్రచారాలకు పరిమితం

పాలన లేదు - ప్రచారాలకు పరిమితం


విజయవాడ :


బెంజిసర్కిల్ వద్ద గల జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పోతిన వెంకట మహేష్ మరియు అక్కల గాంధీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం పాలన చేతకాక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, దేశంలో ఆర్థిక మాంద్యం ఉంటే రాష్ట్రంలో జగన్ మాంద్యం ఉందని యువజన శ్రామిక రైతు పార్టీ అని పేరు పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతను ఇసుక పాలసీ ఇంతవరకు ప్రకటించకుండా లక్షలాది మంది శ్రామికులను విత్తనాలు యూరియా సకాలంలో సరఫరా చేయకుండా 0% వడ్డీకి రుణాలు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న వైయస్ఆర్సిపి పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి 1 నుంచి 5 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుతుందని పాదయాత్రలో పదే పదే మాట్లాడిన జగన్ గారు నేడు నవరత్నాల అమలులో అనేక షరతులు విధిస్తూ నవరత్నాలు ను డొల్ల రత్నాలు గా మారుస్తున్నారని రాజధాని అమరావతి మీద గందరగోళ పరిస్థితులను సృష్టించి రాష్ట్ర  అభివృద్ధిని కుంటూపరుస్తున్నారనీ ,రాష్ట్రం నుండి పారిశ్రామికవేత్తలు పెట్టుబడి దారులు వెళ్ళిపోతున్న స్పందించని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఏ విధంగా సాధించగలదని కృష్ణాజిల్లా లో 3 మంత్రులు ఉన్నా బందరు పోర్టు పనులు ప్రారంభించ లేక పోయారని YSRCP,151 MLA లు రబ్బర్ స్టాంపులు ,చెక్క బొమ్మ ఎమ్మెల్యే లని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇక నుండి ఆయన పరిపాలన సక్రమంగా  చేయాలన్నారు . మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ ) మాట్లాడుతూ 100రోజుల వైసీపీ పాలనపై నిన్న జరిగినటువంటి విలేకర్ల సమావేశంలో పవన్ కల్యాణ్  ప్రభుత్వం విఫలమైందని చెప్పడం,అలాగే 100 రోజుల పాలనపై ఒక పుస్తకం విడుదల చెయ్యడం జరిగింది.అయితే దీనిపై వైసీపీ నేతలు ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు నేతలు అయినటువంటి బొత్స గారు,అవంతి శ్రీనివాసరావు ,జక్కంపూడి రాజా ప్రెస్సుమీట్లు పెట్టి లబోదిబోమంటున్నారు. అసలు కళ్యాణ్  మాట్లాడింది ప్రజల్లోకి వెళ్లి వారి ఇబ్బందులు చూసి ఉదాహరణకు ఇసుక కొరత వలన తీవ్రంగా నష్టపోయిన కార్మికులు కల్యాణ్ ని కలిసి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా వారు 28లక్షల మంది ఉపాది లేక రోడ్ మీద పడ్డాం అని చెప్పడం జరిగింది. మీరు ఈ విషయాలపై స్పందించకుండా మీరు రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్లలాగా ఎంతసేపు ప్యాకేజీ,ఎవరో స్క్రిప్ట్ రాస్తే చెబుతున్నారు అని పేలుతున్నారు. మీకు నిజంగా దమ్ముంటే గత ప్రభుత్వం ప్రకటించిన ఐదుశాతం కాపు రిజర్వేషన్లు కాపులకు ఇవ్వాలి అని జగన్మోహనరెడ్డి ని నిలదీయగలరా,ముద్రగడ ఉద్యమానికి మద్దతు పలికారు కదా మరి ప్రభుత్వం రాగానే ఓటు వేసి గెలిపించిన కాపులను మర్చిపోయారా?వీటిమీద దమ్ముంటే చర్చకు రండి అంతే గాని విషయానికి సంబంధం లేకుండా ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఖబడ్దార్ మీకంటే మా పెదాలకు స్పీడ్ ఎక్కువ మీకంటే ఎక్కువ వెటకారాలు వెదజల్లగలం. .ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ అంకెం శ్రీనివాసరావు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తిన రామ్మోహన్ రావు పాల్గొన్నారు .