ఎవ్వరు ప్రశ్నించినా ఎదురుదాడి చేస్తున్నారు: కళా వెంకట్రావు

ఎవ్వరు ప్రశ్నించినా ఎదురుదాడి చేస్తున్నారు: కళా వెంకట్రావు
గుంటూరు : గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష అక్రమాలను అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు సమర్ధించుకోవటం హేయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవకతవకలు జరిగాయని అభ్యర్థులు వాపోతుంటే... వారిని నోరెత్తవద్దంటూ బెదిరిస్తున్నారని విమర్శించారు. సన్న బియ్యం, ఇతర హామీలపై ఎవ్వరు ప్రశ్నించినా ఎదురుదాడి చేస్తున్నారని, డిక్టేటర్ మాదిరి పాలించటం తగదన్నారు. ప్రజలు ప్రశ్నించే హక్కును తొక్కలేరని, 20 లక్షల గొంతులు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం నోరు విప్పకపోవటం సరికాదన్నారు. పరీక్షలో జరిగిన అక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ నైతిక బాధ్యత వహిoచాలన్నారు. ఫలితాలను హోల్డ్‌లో పెట్టి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 20లక్షల మంది నిరు ద్యోగులకు తప్పనిసరిగా న్యాయం చేయాలని కళా వెంకట్రావు కోరారు.