ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకులు దివంగత కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి వారసులు శివలెంక పావని ప్రసాద్ మరియు ఏపీ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు అంబటి మధు మోహనకృష్ణ సారథ్యంలో అవయవ దానం ఇతివృత్తంగా జాతీయ స్థాయి నటి, నటీమణులు, బాల నటులు, సాంకేతిక నిపుణులతో నిర్మితమయ్యే 'తర్పయామి' చిత్రం షూటింగ్ మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో శుక్రవారం ప్రారంభమైంది. చిత్ర ప్రముఖులతో పాటు మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో పాల్గొన్న విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు 1981 నుంచి ఆంధ్ర పత్రిక తో తన జర్నలిజం కెరీర్ ప్రారంభం కావడం తన అదృష్టమని అన్నారు.
తర్పయామి' చిత్రం షూటింగ్ ప్రారంభం