పరిష్కరిస్తామన్నా గందరగోళం చేస్తున్నారు: ఇక్బాల్
అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్దికోసం తాపత్రయం పడుతున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లేని నల్లపిల్లిని చీకటి గదిలో వెతికినట్లుందని..లేనిది సృష్టించి రాజకీయంగా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాస్తవాలను కలిసి పరిస్కారం చేద్దామని అంటున్నా గందరగోళం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించి శాంతి భద్రతలు లేకుండా చేయడం చంద్రబాబు టార్గెట్ అని అన్నారు. అచ్చెన్నాయుడు పోలీస్ అధికారులను దూషించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడి సృస్టిస్తున్నారని ఇక్బాల్ అన్నారు.
పరిష్కరిస్తామన్నా గందరగోళం చేస్తున్నారు: ఇక్బాల్