కౌలు రైతులకు ఋణాలు అందించుటలో సహకార బ్యాంకులు కీలకపాత్ర పోషించాలి:సిఎస్


తేది : 19.09.2019
అమరావతి


కౌలు రైతులకు ఋణాలు అందించుటలో సహకార బ్యాంకులు కీలకపాత్ర పోషించాలి:సిఎస్


అమరావతి,19సెప్టెంబరు: రాష్ట్రంలోని కౌలు రైతులకు ఋణాలు మంజూరు చేయడంలో సహకార బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. గురువారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో రాష్ట్రంలోని గ్రామీణ సహకార క్రెడిట్ ఇనిస్టిట్యూట్ల పనితీరుపై రాష్ట్రస్థాయిలో మొదటి హైలెవెల్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కౌలు రైతులకు ఋణాలు అందించేందుకు రూపొందించిన చట్టాన్ని అనుసరించి భూమి యజమానితో సంబంధం లేకుండా నేరుగా ఆయా కౌలు రైతులకు ఋణ సౌకర్యం కల్పించేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆప్కాబ్, డిసిసిబి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు వంటి సహకార బ్యాంకులు కీలకపాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ప్రస్తుతం కౌలు రైతులకు అనుకున్నంత స్థాయిలో ఋణాలు అందడం లేదని కావున కౌలు రైతులందరికీ సకాలంలో ఋణాలు అందించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, సహకార శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆదేశించారు. అదే విధంగా కౌలు  రైతుల చట్టాన్ని అనుసరించి భూమి యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు నేరుగా ఋణాలు మంజూరు చేసే అంశంపై గ్రామ స్థాయిలో గోడపత్రికలు, కరపత్రాలు, బ్యానర్లు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో ఆప్కాబ్, డిసిసిబి, నాబార్డు వంటి సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు.


 రాష్ట్రంలోని ఉత్తమ పనితీరు కనపరుస్తున్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను గుర్తించి వాటిని కంప్యూటరీకరించి డిసిసిబి, ఆప్కాబ్ తో అనుసంధానించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. అదేవిధంగా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు సహకార పరపతి సంఘాలు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు బంధు పథకం కింద రైతులకు ట్రాక్టర్లు అందించే కార్యక్రమంపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు ముఖ్యంగా వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన యువతకు ఎరువులు అమ్మకాల్లో భాగస్వామ్యం కల్పించాలని తద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగు అవడంతోపాటు రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేసేందుకు వీలువుతుందని కావున ఆదిశగా చర్యల చేపట్టాలని సిఎస్ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు.


 నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.సెల్వరాజ్ సమావేశపు అజెండా వివరాలను తెలయజేస్తూ కౌలు రైతులకు ఋణాలు, కార్పొరేట్ గవర్నెన్స్, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. 


ఆప్ కాబ్ ఎండి కె.తులసీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది కౌలు రైతులకు 1200కోట్ల రూ.లు ఋణాలు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం కాగా ఆదిశగా బ్యాంకులు, సహకార బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 2 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలుండగా వాటిలో 1300 సంఘాలు లాభాల్లో నడుస్తున్నాయని, అలాగే ఆప్ కాబ్, డిసిసిబిలు నిరంతరం లాభాల్లో నడుస్తున్నాయని వివరించారు. ఇంకా ఈ సమావేశంలో గ్రామీణ పరపతి సంస్థలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.


 ఈ సమావేశంలో రాష్ట్ర సహకారశాఖ కమీషనర్ జి.వాణీమోహన్, ఆర్బీఐ జనరల్ మేనేజర్ జోగి మేఘనాథ్, నాబార్డు జనరల్ మేనేజర్ ప్రభాకర్ బెహ్రా, ఆర్బీఐ మేనేజర్ ఉదయ్ కృష్ణ, నాబార్డు డిజియం బి.రమేశ్ బాబు, ఎజియం టి.విజయ్ తదితరులు పాల్గొన్నారు.


........


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image