పోలీసులతో అఖిలప్రియ వాగ్వాదం

పోలీసులతో అఖిలప్రియ వాగ్వాదం
విజయవాడ : తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నోవాటెల్ హోటల్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన అఖిల ప్రియను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు.. అఖిలప్రియ మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రూమ్‌ను కూడా పోలీసులు తనిఖీ చేశారు. దీనిపై అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చిన బుధవారం నాటి 'ఛలో ఆత్మకూరు'ను భగ్నం చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేస్తున్నారు. టీడీపీ శిబిరం వద్ద నుంచి మీడియాను బలవంతంగా బయటకు పంపివేశారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను, అరాచకాలను రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇవాళ 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే.