కర్నూలు జిల్లా - 6-9-19 -
*ఈ రోజు మధ్యాహ్నం శ్రీశైలం ఐటిడిఎ ప్రాజెక్ట్ పరిధిలో మారుమూల నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలెంచెరువు, చదరంపెంట చెంచు గూడెంలలో పర్యటించి చెంచుల జీవన స్థితి గతులను, నవరత్నాలు, ప్రభుత్వ పథకాలు, ఆదాయ పెంపుదల పథకాల అమలును పరిశీలించి, చెంచుల తో మాట్లాడిన కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, జెసి2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ తదితరులు*
*చెంచుల విల్లు అమ్ములతో.. సరదాగా కాసేపు అమ్ముదబ్బలను సంధించిన కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యే ఆర్థర్*
*చెంచులక్ష్మి స్వయం సహాయక సంఘం సభ్యురాలు మహేశ్వరి.. ఐటిడిఎ ఆర్ధిక సాయంతో పెంచుతున్న మేకల పెంపకం కేంద్రాన్ని, ప్రకృతి వ్యవసాయం తో పోతన్న అనే చెంచు రైతు చేపట్టిన కూరగాయల పెంపకాన్ని , చెంచు మహిళలు చేపట్టిన నన్నారి షరబత్ తయారీని, ఐసిడీఎస్ ప్రాజెక్ట్ తరఫున సాములు, సజ్జలు, జొన్నలు తదితర చిరుధాన్యా లతో చేసిన పోషకాహార స్టాల్ ను, మెడికల్ క్యాంపు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ తదితరులు*
*అనంతరం, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చదరం చెంచు గూడెంలో పోషణ అభియాన్ -పౌష్టికాహార మాసోత్సవం కార్యక్రమంలో పాల్గొని, చెంచులకు సహజసిద్ధమైన పోషకాహార విలువలు, వ్యక్తి గత పరిశుభ్రత, పౌష్టికాహారం తో రక్తహీనత నివారణ ఆవశ్యకతను వివరించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుపేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, నవరత్నాల ను సద్వినియోగం చేసుకోవాలని చెంచులను జాగృతపరచి, చెంచు గర్భిణీ మహిళల సామూహిక శ్రీమంతం సారెను కొంతమంది చెంచు మహిళలకు అందించి, చెంచుల సంప్రదాయ కోయ డ్యాన్స్ ను తిలకించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ తదితరులు*
*జెసి2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, శ్రీశైలం ఐటిడిఎ పిఓ మరియు డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, ఐసిడిఎస్ పీడీ లీలావతి, సమాచార శాఖ డిడి తిమ్మప్ప, స్థానిక ప్రజాప్రతినిధులు, కొత్తపల్లి మండల అధికారులు పాల్గొన్నారు*
------------------------