దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో సి.ఎస్

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం                                                                                                                              ఇంద్రకీలాద్రి :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం కుటుంబ సమేతముగా శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము ఎల్.వి.సుబ్రహ్మణ్యం కుటుంబమునకు ఆలయ స్థానాచార్యుల వారు, వేదపండితులు వేద ఆశీర్వచనము చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి  ఎం.వి.సురేష్ బాబు అమ్మవారి ప్రసాదము, చిత్రపటమును అందజేసినారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు వారు ఆలయములో చేపట్టవలసిన రాతిమండపము మరియు ఇతర అభివృద్ధి పనుల గురించి చీఫ్ సెక్రటరీ శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్ కి వివరించారు. అనంతరము చీఫ్ సెక్రటరీ శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్  మాట్లాడుతూ రానున్న దసరా మహోత్సవాలు శాస్త్రోక్తముగా మరియు అత్యంత వైభవముగా జరిపించి ప్రతిఒక్క భక్తునికి దర్శనము బాగా జరిగేలా చర్యలు చేపట్టవలసినదిగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారికి తెలియజేశామని, అలాగే వాస్తురీత్యా, రాతిమండపము మరియు ఇతర అభివృద్ధి పనులకు మంచి సాంకేతిక పరిజ్ఞానముతో పనులు చేపట్టి అమ్మవారి వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేవిధముగా, మరియు ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరియు పర్యాటకులకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి గౌరవనీయులైన దేవాదాయశాఖ మంత్రి వర్యులు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి వారు చర్చలు జరిపారని, అందుకు కావలసిన సహాయ సహకారాలు అందజేయడానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు.