మళ్లీ విమానాల కళ

మళ్లీ విమానాల కళ
వింటర్‌ షెడ్యూల్స్‌తో కొత్త ఊపిరి
ఢిల్లీ, ముంబాయి, కొచిన్‌, చెన్నై, తిరుపతి, విశాఖలకు..
ఎయిర్‌పోర్టులో విమానాశ్రయ విమానయాన సంస్థల మీట్‌
ఏపీడీ మధుసూదనరావు అధ్యక్షతన సమావే శం
విజయవాడ : విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశీయంగా హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, కొచ్చి న్‌, ఢిల్లీ, ముంబయిలకు విమానసర్వీసులు పెరగబోతున్నాయి.  విజయవాడ ఎయిర్‌పోర్టులో జరిగిన లోకల్‌ ఎయిర్‌లైన్స్‌ మీట్‌లో ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు శుభవార్తను అందుకున్నారు. లోకల్‌ ఎయిర్‌లైన్స్‌ వెలిబుచ్చిన నూతన షెడ్యూల్స్‌లో కొన్నింటికీ తేదీలు ఖరారుకాగా మరికొన్నింటికి అతి త్వరలో ఖరారు చేయను న్నారు. ఏవియేషన్‌ సమ్మిట్‌కు సంసిద్ధమౌతు న్న తరుణంలో డొమెస్టిక్‌గా విమాన సర్వీసు లు పెరుగుతుండటం పట్ల విమానాశ్రయ అధికారులు హర్షంవ్యక్తం చేస్తున్నారు.  విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏవియేషన్‌ సలహాదారు భరత్‌ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌, ఇండిగో, ట్రూజెట్‌ విమానయాన సంస్థల మేనేజర్లు పాల్గొన్నారు. ఎయిర్‌లైన్స్‌ సంస్థల నుద్దేశించి ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారు భరత్‌రెడ్డి, ఎయిర్‌ పోర్టు డైరెక్టర్‌ మధు సూదనరావులు మాట్లాడుతూ, విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశీయంగా డిమాండ్‌ ఉందని గణాంకాలను వివరించారు. సమా వేశంలో పాల్గొన్న నాలుగు విమానయాన సంస్థలలో మూడు విమానయాన సంస్థలు తమ సర్వీసులకు సంబంధించి షెడ్యూల్‌తో పాటు మరికొన్ని హామీలను ఇచ్చారు.
ఇవీ వింటర్‌ షెడ్యూల్స్‌ :  స్పైస్‌జెట్‌ సంస్థ తరపున సెప్టెంబరు 25వ తేదీ నుంచి విజయవాడ-హైదరాబాద్‌ కు ఉదయం 8.25 గంటలకు సాయంత్రం 8.55 గంటలకు విమాన సర్వీసులను నడప నున్నట్టు ఆ సంస్థ మేనేజర్‌ డొమినిక్‌ తెలి పారు. ఇప్పటి వరకు విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి హైదరాబాద్‌కు ఉదయం 11.25 గంటల తర్వాతే విమానాలు ఉన్నాయి. ఉద యం వేళలో కొత్త విమాన సర్వీసు అందు బాటులోకి వస్తుంది. అక్టోబరు 27 నుంచి కొచ్చిన్‌ - తిరుపతి - వియవాడ రాను, పోను సర్వీసులను తిరిగి పునరుదఽ్ధరించే అవకాశా లు ఉన్నాయని చెప్పారు. దీంతో పాటు విశాఖపట్నం - చెన్నై - విజయవాడ విమాన సర్వీసులను కూడా నడపటానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అక్టోబరు 27 నుంచి ముంబైకి నూతన డైలీ ఫ్లైట్‌కు ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో విజయవాడ నుంచి ఢిల్లీకి నడుస్తున్న విమాన సర్వీసును ఉన్నత స్థాయిలో రద్దు చేయాలన్న ఆలోచన ఉందని, రద్దీ ఉంటున్న నేపథ్యంలో, ఈ ఫ్లైట్‌ను రద్దు చేయవద్దని తాము చెప్పినట్టు తెలిపారు.
ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ తరపున ఇక మీదట ప్రతి శుక్రవారం అలయెన్స్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి విజయవాడ - వైజాగ్‌కు సర్వీసును పునరుద్ధరిస్తున్నట్టు ఆ సంస్థ మేనేజర్‌ తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌లో ఈ విమానం బయలు దేరుతుంది. సాయంత్రం 6.30 గంటలకల్లా విజయవాడకు చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి 6.55 గంటలకు విశాఖ బయలుదేరుతుంది. విశాఖకు 7.55 గంటలకు చేరుకుంటుంది. అక్టోబరు 27 నుంచి రద్దు చేసిన విజయవాడ వయా హైదరాబాద్‌ - ఢిల్లీ విమాన సర్వీసును పునరుద్ధరించనున్నట్టు ప్రకటించారు. ఇండిగో విమానయాన సంస్థ తరపున అక్టోబర్‌ 27 నుంచి ఇటీవ లే రద్దు చేసిన ఢిల్లీ సర్వీసును పునరుద్ధరించనున్నట్టు ఆ సంస్థ మేనేజర్‌ కౌశిక్‌ తెలిపారు. అలాగే ముంబైకి ఫ్లైట్‌ నడిపే విషయంలో ఆసక్తితో ఉన్నట్టు తెలిపారు. ట్రూ జెట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తరపున ప్రస్తుతం కొత్తగా అదన పు విమానాలు ఏమీ నడపటం లేదని ఆ సంస్థ మేనేజర్‌ కిరణ్‌రాజు తెలిపారు. ఇటీవల కొనుగోలు చేసిన ఆరవ విమానాన్ని ఇక్కడి నుంచి నడిపే పరిస్థితి లేదని ఏడు, ఎనిమిదవ విమానాలుగా వచ్చే వాటిలో తప్పకుండా ఒకదానిని ఇక్కడి నుంచి నడిపే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.


Popular posts
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*
Image
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పాఠశాలల ప్రారంభ నిర్ణయంపై పునరాలోచించాలి* ఏ.బి.వి.పి నేత చల్లా.కౌశిక్.... వింజమూరు, ఆగష్టు 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచించడం సబబు కాదని, వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌశిక్ బుధవారం నాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి కరోనా బారిన పడి బాధపడుతున్నా వారికి బోధపడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు పధకాల ప్రారంభం, ప్రచార ఆర్భాటాల కోసం పిల్లల జీవితాలను పణంగా పెట్టాలని చూస్తే ఏ.బి.వి.పి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్యార్ధుల తల్లిదండ్రులతో గ్రామ, గ్రామీణ సర్వేను ఏ.బి.వి.పి నిర్వహించిందని కౌశిక్ పేర్కొన్నారు. 82 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, డిగ్రీ, పి.జీ, విశ్వ విద్యాలయాలలో చదివే విధ్యార్ధులు రోగనిరోధక శక్తి కలవారన్నారు. వారిని కాకుండా కేవలం ముందుగా పాఠశాలల బడులను తెరవడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఇలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పర్యవసానాలలో భాగంగా ప్రారంభించిన కొద్ది రోజులలోనే లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఆన్లైన్ ఫీజుల దందాను అరికట్టడంలో శ్రద్దాసక్తులు లేని రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల ప్రారంభానికి ఎందుకంత ఆరాటమన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ఇక ప్రత్యక్షంగా చేసుకోవడానికి ప్రభుత్వం మార్గాలు సుగమం చేయడమేనని కౌశిక్ దుయ్యబట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందా - ప్రభుత్వ పధకాల ప్రచార దందా రెండూ కలిసి వస్తాయా అని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రోగ నిరోధక శక్తి తక్కువ కలిగి ప్రస్తుత కరోనా పరిస్థితులను ఎదుర్కోలేని పసిపిల్లలపై ప్రభుత్వ అసంబద్ధ ప్రయోగాలు విరమించుకోవాలని హితువు పలికారు. లేని పక్షంలో ఏ.బి.వి.పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని కౌశిక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Image