తెగి పడ్డ 33 కెవి విద్యుత్ వైర్లు 

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చౌరస్తాలో తెగిపడ్డ 33 కెవి విద్యుత్ వైర్లు 
బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలకు విద్యుత్ షాక్ 
ఒకరి పరిస్థితి ప్రమాదకరం 
పూర్తిగా తగలబడ్డ బైక్ 
ఇస్నాపూర్ చౌరస్తాలో ఊహించని ప్రమాదం చోటుచేసుకొని భార్యాభర్తల పాలిట మృత్యు శాపంగా మారింది. జాతీయ రహదారి పక్కనే చౌరస్తాలో 33 కెవి విద్యుత్ వైర్లు తెగి పడటంతో  జాతీయ రహదారిపై బైక్ పై వెళుతున్న ఓ జంటపై ఆ వైర్లు పడి తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా విద్యుద్ఘాతానికి గురికావడం, బైకుకు మంటలు వ్యాపించడంతో భర్త ఆ మంటల్లో చిక్కుకున్నాడు. తెలివిగా అతన్ని పక్కకి తప్పించిన స్థానికులు వెంటనే భార్యాభర్తల ఇరువురిని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భర్త ప్రమాదకరంగా ఉంది. కాగా ఊహించని ఈ సంఘటనతో నిశ్చేష్టులై ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురికావడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతీయ రహదారి వద్ద వైర్లు పడటంతో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్శాఖాధికారులు విద్యుత్ను నిలిపివేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపు చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. జరిగిన సంఘటన చూసిన స్థానికులు తీవ్రంగా భయపడిపోయారు.