తేది.09-09-2019
*నెల్లూరు జిల్లా, మనుబోలు మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొని, ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*సర్వేపల్లి నియోజకవర్గంలోని పత్రికా విలేకరులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిందిగా అభ్యర్ధన.*
*సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కాకాణి.*
*జాతీయ పురష్కారం పొందిన సాంఘిక సంస్కర్త శ్రీ పోటుగుంట మల్లికార్జున్ రావును అభినందించిన ఎమ్మెల్యే కాకాణి.*
👉 స్పందన కార్యక్రమం పెట్టిన తరువాత దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
👉స్పందన లో రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిశీలిస్తున్నారు.
👉ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు నా దృష్టికి వస్తే పరిష్కారానికి చొరవ తీసుకుంటాను.
👉స్పందన కార్యక్రమాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం సమీక్షిస్తున్నారు.
👉ప్రధానంగా భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
👉అర్హులైన రైతులకు అన్యాయం జరగకుండా, పరిష్కరించాలని అధికారులు కు చర్యలు తీసుకోవాలి.
👉ఈ నియోజకవర్గములో భూ పంపిణీ జరిగిన తీరు దౌర్భాగ్యం.
👉గతంలో అసైన్మెంట్ కమిటీలో ఎమ్మెల్యే ను కాదని తయారు చేశారు.
👉చాలా చోట్ల అర్హులైన వారికి కాకుండా, అనర్హులైన వారికి పట్టాలు పంపిణీ చేశారు.
👉అన్ని విషయాలను ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
👉అన్నీ పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాను.
👉మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చేసిన విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తాము.
👉నన్ను రెండవ సారి గెలిపించిన ప్రజలకు అన్నీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తాను.