క్రీడాకారిణి ఆశయానికి లోకేష్ ఆసరా

క్రీడాకారిణి ఆశయానికి లోకేష్ ఆసరా 
- గతంలో ఎన్ఆర్ఐ టిడిపి, యూకే టిడిపి ద్వారా రూ.2.5 లక్షలు
-తాజాగా మరో రూ.2.5 లక్షలు అందజేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 
- పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి చంద్రికకి మొత్తం రూ. 5లక్షలు అందజేసిన టీడీపీ
-ప్రస్తుతం కెనడాలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటున్న చంద్రిక 


క్రీడాకారిణి ఆశయానికి తెలుగుదేశం ఆసరాగా నిలిచింది. ఆమె లక్ష్యానికి చేరుకునేందుకు టీడీపీ చేయూతనందించింది. పవర్ లిఫ్టర్ బొల్లినేని స్వర్ణచంద్రిక అంతర్జాతీయ పోటీలలో రాణించి మన దేశం సత్తా చాటేందుకు తెలుగుదేశం పార్టీ రూ.5 లక్షలు సాయం అందించింది. మాట ఇవ్వడం..నెరవేర్చుకోవడం అంటే ఇదే. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ దేశం గర్వించేలా అద్భుత ప్రదర్శన చేయండి..మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని క్రీడాకారిణికి  హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన కొన్ని రోజులలోనే దానిని నెరవేర్చారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి చంద్రికకు తాజాగా రూ.2.5 లక్షలు సహాయంగా నారా లోకేశ్ అందజేశారు. చంద్రిక  పేదరికంలో ఎన్నో కష్టాలు పడింది. తల్లిదండ్రులు లేరు. అయినా ఓ వైపు విద్య కొనసాగిస్తూనే మరో వైపు పవర్ లిఫ్టింగ్ పోటీలలో తన సత్తా చాటుతూనే ఉంది. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని 50కి పైగా పతకాలు సాధించింది. ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొంటోంది. పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటుతున్న క్రీడాకారిణికి సాయంచేసేందుకు  టీడీపీ ముందుకొచ్చింది. ఇటీవలే ఎన్ఆర్ఐ టిడిపి,యూకే టిడిపి బృందం సేకరించిన 2.5 లక్షల చెక్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా దేశం గర్వించే క్రీడాకారిణిగా ఎదగాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ పోటీలలో సత్తా చాటి మనదేశం, మన రాష్ర్టం, మన మంగళగిరి సత్తా చాటాలని కోరారు. ఇదే సందర్భంలో చంద్రికకు అవసరమైన శిక్షణ, ఆర్థిక అవసరాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చంద్రికకి రూ.2.5 లక్షల సాయాన్ని అందజేశారు. దీంతో ఇప్పటివరకూ టీడీపీ నుంచి క్రీడాకారిణికి మొత్తంగా 5 లక్షలు సాయంగా అందింది. క్రీడాకారిణికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి, సాయం అందించిన నారా లోకేశ్ కి చంద్రిక కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.