ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూత

ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూతన్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రాంజెఠ్మలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.1923లో సెప్టెంబర్ 14న సిఖర్పూర్‌లో జన్మించారు. చరిత్రాత్మక కేసులెన్నింటినో ఆయన వాదించి గెలుపొందారు. ఆరు, ఏడో లోక్‌సభలలో సభ్యుడిగా ఉన్నారు. ముంబై నుంచి రెండు సార్లు గెలిచారు. వాజ్‌పేయి సర్కార్‌లో న్యాయశాఖ మంత్రిగా పని చేశారు.