పరిసరాల శుభ్రత తోనే ఆరోగ్యం పర్యాటక శాఖ మంత్రి ఎం. శ్రీనివాస్. 

పరిసరాల శుభ్రత తోనే ఆరోగ్యం పర్యాటక శాఖ మంత్రి ఎం. శ్రీనివాస్. 


 


పరిసరాల శుభ్రత తోనే ఆరోగ్యం
పర్యాటక శాఖ మంత్రి ఎం. శ్రీనివాస రావు


విశాఖపట్నం సెప్టెంబరు 18: పీల్చే గాలి, తాగే నీరు, తినే పదార్థాలు శుభ్రంగా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యం బాగుంటుందని, పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఇవన్నీ బాగుంటాయని పర్యాటక  సాంస్కృతిక క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ఆయన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు తెలిపారని, ఆరోగ్యం కావాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ఈగలు, దోమలు ఇతర క్రిమి కీటకాలు లేకుండా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు.  దానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ఆరోగ్య శ్రీ, కంటి పరీక్షలు, పౌష్టికాహార పంపిణీ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో పర్యావరణమే ప్రాధాన్యమని చెప్పారు. కార్యక్రమంలో జె సి 2 ఎన్ వి సూర్యకళ, dm&ho డాక్టర్ తిరుపతి రావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారిణి కృష్ణకుమారి, జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి వి ఏ ఎన్ పాత్రుడు
అడిషనల్ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వసుందర తదితరులు పాల్గొన్నారు.  వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తో పాటు ఆశా కార్యకర్తలు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.