ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది

29.10.2019
అమరావతి


అమరావతి: విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు తన సిఫార్సులను వివరించింది. సచివాలయంలో జరిగిన సమావేశంలో తాము గుర్తించిన అంశాలు, విద్యారంగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఇందులోని ముఖ్యమైన అంశాలు ఇవి...


*కమిటీ సభ్యులం ఇప్పటివరకు ఆరుసార్లు సమావేశమయ్యాం. 
*నిపుణుల కమిటీ సభ్యులందరం క్షేత్ర స్ధాయిలో పలుమార్లు పర్యటించాం.
*ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. 
*నాణ్యమైన విద్య ఖర్చుతో కూడుకున్నదిగా మారింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు దయనీయంగా ఉన్నాయి.
*బోధనా పద్ధతులు లోపభూయిష్టంగా ఉన్నాయి. 
బోధనా నైపుణ్యాన్ని భారీగా మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. 
*ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల నమోదు  49.28 శాతమే మాత్రమే ఉంది.
*మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో 43శాతం మంది విద్యార్ధులు నమోదవుతున్నారు. ప్రపంచంలో ఇది అత్యధికం.
*ప్రైవేటు విద్యాసంస్ధల్లో పారదర్శకతా లేదు, నియంత్రణ అంత కన్నా లేదు.
సరైన పర్యవేక్షణ ఉండటం లేదు. 
*మరో వైపు ప్రైవేటు పాఠశాలల్లో బోధన సిబ్బంది పరిస్ధితులు అధ్వాన్నంగా ఉన్నాయి. 
*ప్రైవేటు ఉపాధ్యాయ శిక్షణా సంస్ధలు గణనీయంగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. 


*స్కూళ్లలో డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ పై భారీగా ఖర్చు చేయాల్సి ఉంది.
*దీనికోసం ఉపాధ్యాయులకు శిక్షణనివ్వాల్సిన అవసరం ఉంది. 


*విద్యారంగంలో  శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన కమిటీ. 
అమ్మ ఒడి, విద్యా నవరత్నాల కార్యక్రమాలను ప్రశంసించిన కమిటీ
*పాఠశాల, ఉన్నత విద్యారంగాలపై నియంత్రణ, పర్యవేక్షణలకు కమిషన్‌ల  ఏర్పాటును గట్టిగా సమర్ధించిన కమిటీ. 
*కంటి వెలుగు, పాఠ్య ప్రణాళిక మార్పు, పదోతరగతి పరీక్షల్లో సంస్కరణలు, 
*విద్యా హక్కు చట్టం అమలుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడిన కమిటీ. 


*వచ్చే ఐదేళ్ల కోసం లక్ష్యాలను నిర్దేశించిన కమిటీ.
6 నుంచి 16 యేళ్లు లోపు పిల్లలందరూ పాఠశాలలో చదువుకునేలా చేయాలన్న కమిటీ.
*స్టూడెంట్‌ లెర్నింగ్‌ అవుట్‌ కం ప్రతీయేటా 8 శాతం పెరిగేలా చూడాలి. దానిపై థర్డ్‌ పార్టీ నిర్ధారణ జరగాలి. 
*హైస్కూలు స్ధాయిలో ఏ విద్యార్ధి డ్రాప్‌అవుట్‌ కాకూడదు. నూటికి నూరు శాతం విద్యార్ధులు పదో తరగతి పూర్తి చేయాలి. మధ్యలో బడి మానేయకూడదు.
*సమాజంలో పట్టణ, గ్రామీణ విద్యార్ధుల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంతో పాటు, సామాజిక, ఆర్ధిక అంతరాలు లేకుండా చూడాలి. 
*అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక, డిజిటల్‌ సదుపాయలు ఉండాలి. 


*తక్షణమే ప్రయోజనం చేకూరే ప్రాజెక్టునలు సిఫార్సు చేసిన కమిటీ ..
*రాత, పఠనా సామర్ధ్యాలను పెంచే విధంగా క్యాంపెయిన్‌ చేయాలి.
*మారుమూల గిరిజన ప్రాంతాల్లో బడి మానేయకుండా ప్రతీ విద్యార్ధి మీద అసెస్‌మెంట్‌ ట్రాకింగ్‌ ఉండాలి. 
*స్కూల్‌ బ్యాగు బరువు తగ్గించాలి. 
ఎనిమిదో తరగతి నుంచి వృత్తి విద్య  ఉండాలి. 
వచ్చే ఏడాది 1 నుంచి 8 వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నందున.. ఇంగ్లీషు మీడియంలో ఉపాధ్యాయులకు శిక్షణనివ్వాలి. 
*ఉపాధ్యాయుల నైపుణ్యం మీద తప్పనిసరిగా మదింపు ఉండాలి. నిరంతం వారిలో నైపుణ్యం పెంచడానికి కార్యక్రమాలు చేపట్టాలి. 
ప్రతీయేటా శిక్షణ తప్పనిసరి. 
*ఇంటర్మీడియట్‌ వరకు ఉచిత నిర్భంద∙విద్య అమలు చేయాలి. 
*హైస్కూల్స్‌ అన్నింటినీ కూడా జూనియర్‌ కళాశాలల వరకు అప్‌గ్రేడ్‌ చేయాలి. 
*ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ బోర్డులను కలిపి, ఒకే కమిషనర్‌ పరిధిలోకి తేవాలి. 
*అన్ని స్కూళ్లలో ఎస్సీఈఆర్టీ సిలబస్‌ ఉండాలి. 
రాష్ట్రస్ధాయిలో ప్రాధమిక విద్య ఒకే గొడుగు కింద తీసుకురావాలి.
*అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం మార్గదర్శకాలు రూపొందించాలి. 
ప్రాధమిక విద్యలో అంతర్గతంగా సమన్వయ మండలి ఉండాలి. 
*గురుకుల పాఠశాలల నిర్వహణకోసం ఒక మండలి ఉండాలి. 
*డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ కోసం కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలి.
*ప్రతీనెలా కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలి.