ఫలించిన విశాఖ  ఎంపీ ఎంవీవీ ప్రయత్నం

ఫలించిన విశాఖ  ఎంపీ ఎంవీవీ ప్రయత్నం 
-విశాఖ నుంచి కొల్లామ్ కు ప్రత్యేక రైల్  కు  ఈస్ట్ కోస్ట్ రైల్వే గ్రీన్ సిగ్నల్
-ప్రత్యేక రైల్ కోరుతూ ఇటీవల రైల్వే  జీ ఎం కు వినతిపత్రాన్ని పంపిన ఎంవీవీ గారు 
- హర్షాన్ని వ్యక్తం చేస్తున్న అయ్యప్ప మాలధారులు
————————————————-
అయ్యప్ప  మాల ధరించిన భక్తుల సౌకర్యార్థమై వచ్చేనెల 15 మొదలు జ్యోతిదర్శనం వరకు విశాఖ నుంచి కొల్లామ్ 
కు నేరుగా ప్రత్యేక  రైల్ నడపాలని విశాఖ  ఎంపీ ఎంవీవీ  ఈ .కో అధికారులను కోరినవిషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు నవంబర్ 17  మొదలు వచ్చే ఏడాది జనవరి 21 వరకు రానూ,పోను మొత్తం 20 ట్రిప్పులు నడిపేందుకు పచ్చ జెండా ఊపారు . ఇదే విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు కూడా.అయితే ప్రతి ఏటా భక్తులు ఎదుర్కొంటున్న అంశాలను ఆ లేఖ లో ఎంపీ  గారుప్రస్తావిస్తూ,ప్రత్యేక  రైల్ ప్రకటన చేయాలని ఆ లేఖలో విన్నవించారు . తాజా ప్రకటనతో అయ్యప్ప భక్తుల్లో ఆనందాలు వెల్లివిరిసి,సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.