14.11.2019
తిరుపతి
పేద పిల్లలు చదివే ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనే నాడు – నేడు : జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
తిరుపతి, నవంబర్ 14 : రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం రెండే నని ఒకటి విద్యావ్యవస్థ పారిష్టం, యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం అని అందుకే పేదలు చదివే ప్రభుత్వ బడుల్లో దశలవారిగా వసతులు కల్పించ నున్నారని జిల్లా ఇంచార్జి మంత్రి మరియు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక మంగళం కాలనీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నాడు –నేడు కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి ముఖ్య అతిధిగా, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, తుడ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి అతిధిలుగా పాల్గొన్నారు.
జిల్లా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం ప్రారంభించినా శుభ సూచికంగా తప్పనిసారి వరుణుడు అభయ మిస్తూ వర్షం వస్తుందని నేడు అదేవిధంగా జరిగిందని అన్నారు. తొమ్మిది అంశాలతో పేదపిల్లలు చదివే బడులను నాడు గతంలో వున్నది , రాబోవు రోజుల్లో నేడు కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దే వుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేడు బాలల దినోత్సవంలో పండుగా ప్రారంభించుకుంటున్నామని అన్నారు. తెలుగు మాతృబాషకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంగ్లీస్ అమలు పెద పిల్ల భవిష్యత్ కోసమేనని అన్నారు. అమ్మఓడి అమలు చేసి పేదపిల్లలు బడికి రావడానికే నని బంగారు భవిషత్ ముందుందని అన్నారు.
డిప్యూటీ సి ఏం మాట్లాడుతూ ఇంగ్లీస్ విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అమలు ఎస్.సి., ఎస్.టి.,బీసీలకు , పేదలకు మేలుకలుగుతుందని డబ్బుల్లేక ఎంతోమంది తల్లి దండ్రులు కార్పొరేట్ విద్యలో చేర్పించాలని వున్నా చేయలేక పోతున్నారని పేదల ఆశయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి విద్యాలయాల్లో వసతులకు శ్రీకారం చుట్టారని అన్నారు. తల్లిదండ్రుల కమిటీల సూచనల మేరకు విద్యాలయాలు కొత్తదనం రూపుదిద్దుకోనున్నదని అన్నారు.
తుడా ఛైర్మన్ మాట్లాడుతూ అమ్మఒడి పతకంద్వారా జనవరిలో పెద విద్యార్థుల తల్లులు రూ 15 బిలు అందుకొనున్నారని అన్నారు. పిల్లల భవిష్యత్ దృష్టిలో వుంచుకుని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీస్ అమలు ముఖ్యమంత్రి అమలుకు శ్రీకారం చుట్టారని అన్నారు. నేను పూర్తిగా పి.హెచ్.డి.వరకు తెలుగులో చదివానని నేడు కనీసం ప్రక్క రాష్టంలోకి వెళ్ళి ఇంగ్లీస్ లో మాట్లాడలేకున్నానని అన్నారు. తెలుగు మాతృ బాషకు తక్కువ చేయడం లేదని, ఇంగ్లీష్ తో పిల్లలకు భరోసా, భవిష్యత్ వుంటుందని అన్నారు. నేడు ప్రవేట్ విద్యాసంస్థల్లో ఎక్కడా తెలుగు పాఠశాలలు లేవనే విషయం మనం గ్రహించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాడు – నేడు మంచి కార్యక్రమం నేడు జిల్లాలో ప్రారంభించుకోవడం ఆనందంగా వుందని మెదటి విడతలో మన జిల్లాలో 1504 పాఠశాలల్లో మార్చి 2020 నాటికి పూర్తి స్థాయి వసతులు కల్పించనున్నామని అన్నారు. వసతులు పూర్తి అయితే ఒక మంచి వాతావరణం గల పాఠశాలలో చదువుతున్నామనే అనుభూతి కలగనున్నదని అన్నారు.
సభ ప్రారంభానికి ముందుగా ముఖ్యఅతిధిలు విద్యావిదానంలో అమలు చేస్తున్న స్టాల్స్ ను పరిశీలించి, జిల్లాలో మనబడి - నాడు - నేడు కార్యక్రమం శిలా పలకాన్ని ప్రారంభించి నెహ్రూ చిత్రపటానికి పూలు సమర్పించి, జ్యోతిప్రజ్వలన చేశారు.
ఈ సమావేశంలో నగరపాలక కమిషనర్ గిరిశా, డి ఈ ఓ నరసింహారెడ్డి, పాఠశాల ప్రధానోపాద్యాయులు కేశువులు నాయుడు, విద్యాశాఖ అధికారులు, ఉపాద్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు వర్షం వచ్చినా లెక్కచేయకుండా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.