13న టూరిజం ఇన్వెస్టర్స్‌ అండ్‌ స్టాక్‌ హోల్డర్స్ మీట్‌

మరింత అభివృద్ధిపథంలో టూరిజం శాఖ


• 13న టూరిజం ఇన్వెస్టర్స్‌ అండ్‌ స్టాక్‌ హోల్డర్స్ మీట్‌


విజయవాడ, నవంబర్‌ 12: పర్యాటకంగా రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13న అమరావతి(వెలగపూడి) సచివాలయంలో టూరిజం ఇన్వెస్టర్స్‌ అండ్‌ స్టాక్‌ హోల్డర్స్ మీట్‌ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌(ఏపీ ఛాంబర్స్‌) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) కీలకోపన్యాసం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం ఆవశ్యకతను ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.ప్రవీణ్‌కుమార్‌,  అలాగే టూరిజం పాలసీలపై ఏపీ ఛాంబర్స్‌ టూరిజం కమిటీ చైర్మన్‌ కె.లక్ష్మీనారాయణ వివరించనున్నారు. అలాగే టీటీఏఏ ప్రెసిడెంట్‌ కె.విజయమోహన్‌, హెచ్‌ఆర్‌ఏఏపీ ప్రెసిడెంట్‌ ఎస్‌.ప్రశాంత్‌, ఏపీహెచ్‌ఏ ప్రెసిడెంట్‌ టి.సత్యనారాయణ, ఏపీఏఏ ప్రెసిడెంట్‌ తరుణ్‌కాకానీ, కల్చరల్ సెంటర్‌ సీఈవో డాక్టర్‌ శివనాగిరెడ్డి తదితరులు సలహాలు, సూచనలు అందించనున్నారు.